ఎనిమాల్ డైరెక్టర్.. భవిష్యత్తులో హై వోల్టేజ్ కాంబినేషన్స్

అయితే తాజాగా గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగాని బాలీవుడ్ లో మీరు ఎవరితో సినిమాలు చేయాలని అనుకుంటున్నారని అడిగితే షారుక్ ఖాన్ తో కలిసి వర్క్ చేయాలని ఉందని చెప్పారు.

Update: 2024-02-05 04:32 GMT

ఇటీవల కాలంలో మన సౌత్ డైరెక్టర్స్ నార్త్ లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో 'జవాన్' సినిమాని తెరకెక్కించి బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు సౌత్ యంగ్ డైరెక్టర్ అట్లీ. జవాన్ బాలీవుడ్ లో 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనాలు సృష్టించింది. ఒక్క సినిమాతోనే అట్లీ బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఆ తర్వాత ఇదే ట్రెండ్ ని టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కంటిన్యూ చేశాడు.

రణబీర్ కపూర్ తో ఈ డైరెక్టర్ తీసిన 'యానిమల్' సైతం సేమ్ రిజల్ట్ అందుకుంది. ఈ సినిమా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వెయ్యి కోట్లకు దగ్గరగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా 'యానిమల్ పార్క్' కూడా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత సందీప్ ఎవరితో సినిమా చేస్తాడు? అనేదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

అయితే తాజాగా గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగాని బాలీవుడ్ లో మీరు ఎవరితో సినిమాలు చేయాలని అనుకుంటున్నారని అడిగితే షారుక్ ఖాన్ తో కలిసి వర్క్ చేయాలని ఉందని చెప్పారు. అలాగే రణ్ వీర్ సింగ్ తోనూ సినిమా చేయాలని ఉందంటూ చెప్పాడు. యానిమల్ సక్సెస్ తో బాలీవుడ్ లో రణబీర్ కు వచ్చిన క్రేజ్ చూసి అక్కడి స్టార్స్ సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు.

ఒకవేళ అదే జరిగితే సందీప్ మళ్లీ తిరిగి టాలీవుడ్ కి వచ్చే సిచువేషన్ లేదని అంటున్నారు. ఎందుకంటే ఒక్కో ప్రాజెక్ట్ కు ఈ డైరెక్టర్ ఏడాది నుంచి టైం ఏడాదిన్నర సమయం తీసుకుంటూ ఉంటారు. ఆ లెక్కన చూసుకుంటే అనిమల్ పార్క్, స్పిరిట్ సినిమాలకే మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాత ఇద్దరు స్టార్ హీరోల సినిమాలంటే ఇంకో మూడేళ్లు పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే మొత్తంగా మరో ఆరు సంవత్సరాలు సందీప్ రెడ్డి వంగ తిరిగి టాలీవుడ్ కి రాకపోవచ్చు.

మరోవైపు యానిమల్ మూవీ ప్రమోషన్స్ లోనే మహేష్ బాబు, చిరంజీవి లాంటి హీరోలతో సినిమాలు చేస్తానని సందీప్ వంగా చెప్పాడు. మరి ఆ ప్రాజెక్ట్స్ ఎప్పుడుంటాయో చూడాలి. ఇక యానిమల్ పార్క్ విషయానికొస్తే.. 'యానిమల్' స్టోరీని రాసుకున్నప్పుడే.. 'యానిమల్ పార్క్'కు సంబంధించిన బేసిక్ కథ పూర్తయినట్టు తెలుస్తోంది. కానీ దానిని పూర్తిస్థాయి స్క్రిప్ట్ గా మార్చడానికి మరికాస్త సమయం పడుతుందట. 2025 లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News