టాలీవుడ్‌ లోని ఆ లోటు తీర్చబోతున్న 'MAD' సంగీత్‌

ఇప్పటికే పలు సినిమాలు ఇంకా సిరీస్ లతో అలరించిన సంగీత్ శోభన్ తాజాగా MAD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు.

Update: 2023-10-06 12:11 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా కామెడీ హీరో ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. రాజబాబు నుంచి మొదలుకుని అల్లరి నరేష్ వరకు ఎంతో మంది కామెడీ హీరోలు వచ్చారు. కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో కామెడీ హీరో లోటు కనిపిస్తుంది. ఆ మధ్య అల్లరి నరేష్ చేసిన సినిమాలు నిరాశపరచడంతో కామెడీ సినిమాలకు దూరం అయ్యాడు.

అల్లరి నరేష్‌ ఈ మధ్య సీరియస్ కథలతో సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. జాతిరత్నాలు సినిమాతో నవీన్ పొలిశెట్టి కామెడీ హీరోగా మెప్పించినా కూడా ఆ తర్వాత ఆయన కామెడీ హీరోగా కంటిన్యూ అవ్వాలనుకోవడం లేదు. దాంతో కామెడీ సినిమాలు రావడం లేదని సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టకేలకు ఇండస్ట్రీకి ఓ కామెడీ హీరో దొరికాడు అనిపిస్తుంది. ఇప్పటికే పలు సినిమాలు ఇంకా సిరీస్ లతో అలరించిన సంగీత్ శోభన్ తాజాగా MAD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. తన కామెడీ టైమింగ్ తో టాలీవుడ్‌ కి ఓ మంచి కామెడీ హీరో దొరికాడు అంటూ అంతా అనుకునేలా చేశాడు.

సంగీత్‌ శోభన్ ఎవరో కాదు యువ హీరో సంతోష్‌ శోభన్ తమ్ముడు... దివంగత దర్శకుడు శోభన్ తనయుడు. అన్నయ్య సంతోష్ శోభన్‌ హీరోగా ఒక వైపు సీరిస్‌ సినిమాలు చేస్తూ ఉంటే మరో వైపు సంగీత్ కామెడీ సిరీస్ లు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సీరియస్ పాత్రలు చేయాలని అనవసర ప్రయత్నాలు చేయకుండా సంగీత్‌ శోభన్‌ కామెడీ స్క్రిప్ట్‌ లు ఎంపిక చేసుకుంటే మరో అల్లరి నరేష్ గా ఇతడు నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు సంగీత్‌ శోభన్‌ నుంచి మంచి కామెడీ సినిమాలు డౌన్ లోడ్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనిపిస్తుంది. దర్శకులు సంగీత్‌ కోసం మంచి కామెడీ స్క్రిప్ట్‌ లు పట్టుకెళ్తే అతడు పూర్తి న్యాయం చేస్తాడని అనిపిస్తుంది.

Tags:    

Similar News