హీరో వేధింపులు.. అయినా న‌టి క్ష‌మాప‌ణ‌..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా లైంగిక వేధింపులు అన్ని రంగాల్లోను ఉన్నాయి. ముఖ్యంగా గ్లామ‌ర్ రంగంలో వేధింపుల ప్ర‌హ‌స‌నం గురించి ప్ర‌చారం ఎక్కువ‌.

Update: 2024-07-17 04:49 GMT

ప్ర‌పంచ‌వ్యాప్తంగా లైంగిక వేధింపులు అన్ని రంగాల్లోను ఉన్నాయి. ముఖ్యంగా గ్లామ‌ర్ రంగంలో వేధింపుల ప్ర‌హ‌స‌నం గురించి ప్ర‌చారం ఎక్కువ‌. అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లోను వేధింపుల గురించి న‌టీమ‌ణులు ఓపెన‌య్యారు. మీటూ ఉద్య‌మంలో నిర్భ‌యంగా త‌మ‌ను వేధించిన వారి గురించి బ‌హిరంగంగా చ‌ర్చించారు.

 

ఇంత‌కుముందే ప్ర‌ముఖ క‌థానాయిక‌ పాయ‌ల్ ఘోష్ త‌న‌ను పాపుల‌ర్ ద‌ర్శ‌కుడు లైంగికంగా వేధించాడ‌ని ఆరోపిస్తూ సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేసింది. పాత విష‌య‌మే అయినా కానీ, అత‌డి వేధింపుల వ‌ల్ల కంటి నిండా నిదుర క‌రువైంద‌ని వెల్ల‌డించింది. నిద్ర‌మాత్ర‌లు మింగ‌నిదే, రోజూ ఒక గ్లాసైనా ఆల్క‌హాల్ ముట్ట‌నిదే త‌న‌కు నిదురే రాద‌ని తెలిపింది. ఇప్ప‌టికీ ఇలాంటి క‌థానాయిక‌లు చాలా మంది ఉన్నారు. న‌టీమ‌ణుల‌కు ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయ‌ని కూడా ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజనా అన్నే వేధింపుల గురించి ఓపెన‌య్యారు. మోడ‌ల్ కం న‌టి త‌న‌ను అవ‌కాశం పేరిట ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లైంగికంగా వేధించాడ‌ని తెలిపింది. తాను కెరీర్ గురించి మాట్లాడుతాడ‌ని భావిస్తే, అత‌డు త‌న‌తో ప‌డ‌క సుఖం కోరుకున్నాడ‌ని వెల్ల‌డించింది. అయితే దానికి తాను అంగీక‌రించ‌లేదని, దాంతో మేనేజ‌ర్ తో క‌లిసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని కూడా సంజ‌న అన్నే తెలిపారు. ఇది త్రోబ్యాక్ విష‌య‌మే అయినా కానీ ఇప్పుడు మ‌రోసారి దాని గురించి గుర్తు చేసుకున్నారు.

త‌న విష‌యంలో ఇంత‌ జ‌రుగుతున్నా అత‌డి పేరు ఎందుకు వెల్ల‌డించ‌లేదు? అని ప్ర‌శ్నిస్తే.. అతడికి కుటుంబం ఉంద‌ని, పిల్ల‌లు ఉన్నార‌ని.. వారికి అవ‌మానం ఎదుర‌వుతుంద‌నే తాను అలా చేయలేద‌ని సంజ‌న వెల్ల‌డించారు. ఈరోజుల్లో ఎదుటివారి కుటుంబం గురించి ప‌రువు మ‌ర్యాద‌ల గురించి ఎవ‌రైనా ఆలోచిస్తారా?.. కానీ విజ్ఞ‌త క‌లిగిన స‌ద‌రు న‌టీమ‌ణి వేధింపుల మాన్‌స్ట‌ర్ కుటుంబం గురించి ఆలోచించారు. సంజ‌న న‌టించిన `క్రైమ్ రీల్` త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

Tags:    

Similar News