" సంక్రాంతి " చిత్రాలు.. ప్రమోషన్స్ ప్లాన్ ఇలా..
ఎప్పటిలానే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద వివిధ సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.
ఎప్పటిలానే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద వివిధ సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. తెలుగు స్ట్రయిట్ చిత్రాలు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతి వస్తున్నాం విడుదల అవ్వనున్నాయి. దీంతో ఇప్పటికే రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.
రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతుండడం వేళ.. ఇప్పుడు ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు. తమ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చూస్తున్నారు. అందరి దృష్టి తమ మూవీ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరో మూడు వారాల్లో సంక్రాంతి సీజన్ వచ్చేస్తుండడంతో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మేకర్స్ ఇప్పటికే సినిమా నుంచి సాంగ్స్, టీజర్ ను రిలీజ్ చేయగా.. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు. నేడు అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. తద్వారా రిలీజ్ కు ముందు యూఎస్ లో ఈవెంట్ జరిగిన తొలి ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేయనుంది గేమ్ ఛేంజర్.
ఆ తర్వాత విజయవాడలో 250 అడుగుల చరణ్ కటౌట్ ను రివీల్ చేయనున్నారు. అలా అట్రాక్టివ్ ప్రమోషన్స్ గా చేపడుతున్నారు. మరోవైపు, సంక్రాంతి సెంటిమెంట్ తో నందమూరి బాలకృష్ణ.. డాకు మహారాజ్ మూవీతో సందడి చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఆ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
గ్లింప్సెస్ ఓ రేంజ్ లో ఉండగా.. బాలయ్య అవతార్ అంచనాలను పీక్స్ కు చేర్చింది. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. డాకు మహారాజ్ టీమ్ త్వరలో అమెరికా వెళ్లనుంది. అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా పొంగల్ స్పెషల్ గా థియేటర్లలో సందడి చేయనుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేశారు. రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అవ్వగా.. దానిని మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఏ సినిమా విషయంలో అయినా ప్రమోషన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి సంక్రాంతికి చిత్రాలకు ప్రమోషన్స్ ఎంత బెనిఫిట్స్ ఇస్తాయో వేచి చూడాలి.