అప్‌ కమింగ్ మోస్ట్‌ వాంటెడ్‌ వరాలు...!

నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద గౌరవ ప్రదమైన వసూళ్లు దక్కించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సంక్రాంతి సినిమాల హీరోయిన్స్ విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Update: 2024-01-18 05:19 GMT

సంక్రాంతి సందర్భంగా వచ్చిన నాలుగు సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధిస్తూ ఉన్నాయి. నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద గౌరవ ప్రదమైన వసూళ్లు దక్కించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సంక్రాంతి సినిమాల హీరోయిన్స్ విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గుంటూరు కారం సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. కేవలం గ్లామర్ డాల్‌గా మాత్రమే ఆమె కనిపించింది. హనుమాన్ లో కూడా హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఇక సైంధవ్‌ లో హీరోయిన్ ఉన్నట్లా.. లేనట్లా అన్నట్లుగానే ఉంది.

ఇక నా సామి రంగ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్ మాత్రం ఈ సంక్రాంతి ముద్దుగుమ్మల పోటీలో విజయం సాధించినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందంతో పాటు అభినయం తో ఆషికా మెప్పించింది. అందమైన రూపంతో పాటు, పవర్ ఫుల్‌ యాక్టింగ్‌ తో మెప్పించింది.

వరాలు అలియాస్ వరలక్ష్మి పాత్ర తో మెప్పించిన ముద్దుగుమ్మ ఆషికా కి ఇప్పటికే పలు ఆఫర్లు వస్తున్నాయట. టాలీవుడ్ లో త్వరలో మోస్ట్‌ వాంటెడ్‌ గా ఈ అమ్మడు నిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే ఆషికా డేట్ల కోసం సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం అందుతోంది.

మొత్తానికి ఆషికా ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాది వరకు టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా, స్టార్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్‌ కొరత ఉంది. ఆ కొరతను కచ్చితంగా ఆషికా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ హీరోతో నటించినప్పటికీ ఆషికాతో జత కట్టేందుకు పలువురు యంగ్‌ హీరోలు ఇంట్రస్ట్‌ గా ఉండటం విశేషం.

Tags:    

Similar News