సంక్రాంతికి వస్తున్నాం.. 8 రోజుల బాక్సాఫీస్ డామినేషన్

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి అద్భుతమైన విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద న్యూ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Update: 2025-01-22 05:27 GMT

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి అద్భుతమైన విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద న్యూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను థియేటర్లకు నాన్ స్టాప్ గా రప్పిస్తున్నారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం మొదటి రోజు నుంచే మంచి స్పందన అందుకుని, అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద డామినేషన్ చూపిస్తోంది.

సాధారణంగా సెలవులు ముగిశాక సినిమాలకు వచ్చిన క్రేజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం ఇందుకు భిన్నంగా వీకెండ్స్ తరువాత కూడా అదే స్థాయిలో థియేటర్లను నింపుకుంటూ వసూళ్ల పరంగా నిలకడను చూపిస్తోంది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ఈ చిత్రం 218 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం న్యూ రికార్డ్ అని చెప్పవచ్చు.

తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలను మించి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, భారీ లాభాలను సాధిస్తోంది. సంక్రాంతి సెలవుల్లో మంచి కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, రిపబ్లిక్ డే వీకెండ్‌ను కూడా విజయవంతంగా సద్వినియోగం చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వారాంతంలోనే సినిమా 250 కోట్ల మార్క్‌ను దాటుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఓవర్సీస్‌లో కూడా సంక్రాంతికి వస్తున్నాం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే $2.5 మిలియన్ మార్క్‌కు చేరుకున్న ఈ చిత్రం, త్వరలో $3 మిలియన్ మార్క్ ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌తో వచ్చిన ఈ హిట్ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కు మరో జాక్ పాట్ లాంటి సినిమాగా నిలిచింది.

ఈ చిత్ర విజయం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు ఉన్న డిమాండ్ మరోసారి రుజువైంది. అంతేకాకుండా, ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు 300 కోట్ల క్లబ్ చేరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇంతటి విజయం సాధించడం సినిమాకు మాత్రమే కాకుండా, వెంకటేష్ కెరీర్‌కు కూడా మరో బూస్ట్ లాంటిదని చెప్పవచ్చు.

అసలైతే సినిమా మొదట 100 కోట్లు అందుకున్న తరువాత ఫైనల్ రన్ 200 కోట్లు దాటవచ్చని అందరూ అనుకున్నారు. కానీ లెక్క ఇప్పుడు 300 కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు రెస్పాన్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇక సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద నెవ్వర్ బిఫోర్ అనేలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. ఇక వెంకీ కెరీర్ లో కూడా సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైమ్ బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు.

Tags:    

Similar News