సంక్రాంతి బాక్సాఫీస్.. ఎవరి బలం ఎంత?

కానీ ఈసారి సారి కంటెంట్ పరంగా చూసుకుంటే అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది.

Update: 2023-11-07 07:59 GMT

2024 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద చాలా ఆసక్తికరమైన పోటీ కనిపించబోతోంది. ప్రతి సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాలు ఒక మీడియం సినిమా లేదంటే మరొక చిన్న సినిమా పోటీ పడడం చాలా కామన్ గా కనిపిస్తుంది. కానీ ఈసారి సారి కంటెంట్ పరంగా చూసుకుంటే అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది.

అసలు ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలలో ఏ సినిమా ఏ తరహాలో ఆకట్టుకుంటుంది అసలు ఎవరి బలం ఎంత అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా పెద్ద సినిమా అయినటువంటి గుంటూరు కారణంపైనే చాలా మంది ఫోకస్ ఉంది. దీని ఆయుధం మాస్. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సినిమాలో మాస్ కమర్షియల్ ఫార్మాట్లలో కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉండనుంది.

త్రివిక్రమ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మ్యూజిక్ తో ఏదో విధంగా ఉంది కావలసిన బజ్ క్రియేట్ చేయగలరు. కాబట్టి మాస్ రూట్ లో క్లిక్కయితే ఈ సినిమా నెంబర్ వన్ మూవీ గా చెప్పుకోవచ్చు. ఇక దిల్ రాజు గీతాగోవిందం కాంబినేషన్ రిపీట్ చేస్తూ సంక్రాంతికి బారిగా లాభాలు అందుకోవాలని వస్తున్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కలిసి సినిమాలకు వెళ్లి వాతావరణ కనిపిస్తూ ఉంటుంది.

కాబట్టి సినిమా టైటిల్ ఫ్యామిలీ ఫ్యామిలీ స్టార్ అంటూ దర్శకుడు పరశురాం పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాడు. విజయ్ దేవరకొండ మరొకవైపు మాస్ ను కూడా తనవైపు తిప్పుకోగలడు. ఏదేమైనా కూడా ఈ సినిమా పక్కా ఫ్యామిలీ సినిమాగా రాబోతుంది. ఇక మరొకవైపు యాక్షన్ నమ్ముకుని వెంకటేష్ సైంధవ్ తో వస్తుండగా రవితేజ ఈగల్ సినిమాతో పరాబోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలకు సంబంధించిన టీజర్స్ ను బట్టి కంప్లీట్ యాక్షన్ ను హైలెట్ చేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. మరి యాక్షన్ బలం ఈ సినిమాలకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.

నాగార్జున నా సామి రంగని ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయన బంగార్రాజు సినిమాలతో సంక్రాంతికి బిగ్గెస్ట్ సక్సెస్ లు చుడిన నాగార్జున ఈసారి కూడా అదే ఫార్ములా తో రాబోతున్నాడు. ఒకవైపు మాస్ ఆడియన్స్ మరొకవైపు ఫ్యామిలీ ఆడియెన్స్ ను తన వైపుకు తిప్పుకోవాలని నాగ్ చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాలలో అన్నిటి కంటే కాస్త డిఫరెంట్ గా హనుమాన్ సినిమా రాబోతోంది. ఫాంటసీ మూవీ గా రానున్న ఈ సినిమాలో హనుమంతుడి సెంటిమెంట్ బాగానే వాడబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హిందుత్వ ట్యాగ్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా సినిమా కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి సంక్రాంతి ఫెస్టివల్ లో ఎవరి బలం ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో.

Tags:    

Similar News