సంక్రాంతి పోరు.. మీటింగ్ పెట్టినా సెటిలవ్వలే..

గుంటూరు కారం సినిమా నిర్మాతలు అయితే ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. అలాగే హనుమాన్ సినిమా కూడా 5 నెలల ముందే సంక్రాంతి ఫిక్స్ అని తేల్చేశారు.

Update: 2023-12-23 11:08 GMT

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు అలాగే ఒక మీడియం రేంజ్ సినిమా మరో చిన్న సినిమా ఇలా వస్తే పర్వాలేదు కానీ ఒకేసారి అన్ని మంచి బజ్ ఉన్న సినిమాలు వచ్చినా కూడా పెద్ద సమస్య వచ్చి పడుతుంది. తప్పకుండా అన్ని సినిమాలపై కలెక్షన్స్ ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఇక 2024 సంక్రాంతికి పోటీ మాత్రం చాలా ఆసక్తిని రేపుతోంది.

గుంటూరు కారం సినిమా నిర్మాతలు అయితే ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. అలాగే హనుమాన్ సినిమా కూడా 5 నెలల ముందే సంక్రాంతి ఫిక్స్ అని తేల్చేశారు. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది మధ్యలోనే విడుదల చేయాలి. కానీ సంక్రాంతి అయితేనే రిలీజ్ కు పర్ఫెక్ట్ అని నిర్మాతలు రిస్క్ చేసి మరి ఇంతకాలం ఆగారు. ఇక ఇదే బాటలో సంక్రాంతికి మా కంటెంట్ బాగా సెట్ అవుతుంది అని నమ్మకంతో ఈగల్ సినిమాతో పాటు నా సామిరంగా, సైంధవ సినిమాలు సిద్ధమయ్యాయి

అయితే ఈ తరహా క్లాష్ అంత మంచిది కాదు అని కూర్చొని మాట్లాడుకుంటే చాలా బెటర్ అని నిర్మాత దిల్ రాజు సమక్షంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు అయితే చేశారు. అయితే ఆ సమావేశంలో గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ ఈగల్ నిర్మాత విశ్వప్రసాద్ అలాగే నా సామిరంగా నిర్మాత శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు

హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. ఆయన మాత్రం సంక్రాంతి సీజన్ ను ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకూడదు అనే ఆలోచనలో ఉన్నారు. తమ సినిమాను ఎప్పుడో సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చెప్పామని అప్పుడే బిజినెస్ టీమ్స్ కూడా క్లోజ్ అయ్యాయి.. ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని నిర్మాత చాలా పట్టుదలతో కనిపిస్తూ ఉన్నాడు.

ఈ సీజన్లో అయితే గుంటూరు కారం మహేష్ సినిమా కాబట్టి అది వెనక్కి తగ్గే అవకాశం అయితే లేదు. మరోవైపు సురేష్ బాబు సపోర్టుతో సైంధవ సినిమా సంక్రాంతికి బలమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంది. కాబట్టి ఈ రెండు సినిమాల విషయంలో అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇక హనుమాన్ నిర్మాత అయితే సమావేశానికి కూడా హాజరు కాలేదంటే ఆయన వెనక్కి తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.

ఇక మిగిలిన సినిమాలు నా సామి రంగ, ఈగల్ రెండు సినిమాలపైనే అనుమానాలు ఉన్నప్పటికీ వాళ్లు కూడా సంక్రాంతి పై చాలా పట్టుదలతో ఉన్నారు. ఇక మొదటి నిర్మాతల సమావేశం అయితే ఫెయిల్ అవడంతో దిల్ రాజు మరో వారం తరువాత మరోసారి అందరితో చర్చించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మరి అప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి.

Tags:    

Similar News