'కల్కి' కి ఆయన ఇచ్చింది ఎంత....?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా పై అంచనాలు పెంచే విధంగా రెండు ట్రైలర్ లను వదిలారు. సినిమా కథ ఏంటి, హీరో, హీరోయిన్ పాత్రలు ఏంటి అనే విషయమై స్పష్టత మాత్రం ఇంకా రాలేదు.
సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని, సినిమా కాన్సెప్ట్ కూడా హాలీవుడ్ స్థాయి లో ఉండబోతుంది అన్నట్లుగా ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. ఇలాంటి సినిమాలకు పాటలు స్పీడ్ బ్రేకర్స్ మాదిరిగా ఉంటాయి. అందుకే దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్కువ పాటలకు వెళ్లలేదు.
రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి కాస్త దూరంగా ఉండే ఈ సినిమాకి సంగీతాన్ని సంతోష్ నారాయణన్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ లో ఈయన సంగీతం అందించిన సినిమాలు మాత్రం అంతంత మాత్రమే అన్నట్లుగా ఆడాయి.
కల్కి సినిమాలోని చాలా సన్నివేశాల్లో నటీ నటుల ఎలివేషన్ షాట్స్ అద్భుతంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. అలాంటి ఎలివేషన్ సన్నివేశాలు పండాలంటే ఖచ్చితంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. మరి సంతోష్ నారాయణన్ ఏ మేరకు ఆ సీన్స్ కు బీజీఎం ఇచ్చి ఉంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కల్కి సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేక్షకులు కూడా నమ్మకంగా ఉన్నాడు. మరి సినిమా హిట్ లో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పాత్ర ఎంత అనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకునే, బిగ్ బి అమితాబచ్చన్, దిశా పటానీ లు నటించారు. యూనివర్శిల్ స్టార్ కమల్ హాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ లు ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు.