ఆస్కార్ కి నామినేట్ అయిన మ‌రో హిందీ చిత్రం!

ఆస్కార్ లిస్ట్ ప్ర‌క‌టించిన మూడు రోజుల త‌ర్వాత మ‌రో సినిమా పేరు తెర‌పైకి రావ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది.

Update: 2024-09-26 11:22 GMT

భార‌త్ నుంచి 'లాప‌త్తా లేడీస్' ఆస్కార్ కి నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయింది. ఈ విభాగం నుంచి మొత్తం 29 సినిమాలు పోటీ పడగా 'లాపతా లేడీస్' అర్హ‌త సాధించింది. అయితే తాజాగా మ‌రో బాలీవుడ్ చిత్రం ఆస్కార్ కి నామినేట్ అయింది. ఆస్కార్ లిస్ట్ ప్ర‌క‌టించిన మూడు రోజుల త‌ర్వాత మ‌రో సినిమా పేరు తెర‌పైకి రావ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది.

'సంతోష్' అనే చిత్రం ఉత్త‌మ అంత‌ర్జాతీయ ఫిచ‌ర్ ఫిల్మ్ విభాగంలో ఈ అర్హ‌త సాధించింది. ఇది యూకే నుంచి వెళ్తోన్న హిందీ చిత్రం. బ్రిటీస్ ఇండియ‌న్ ఫిల్మ్ మేక‌ర్ సంధ్యాసూరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆస్కార్ కి యూకే నుంచి ఎంపిక అవ్వ‌డం త‌మ కృషి ఫ‌లితంగా భావిస్తున్న‌ట్లు న‌టిగోస్వామి అభిప్రాయ‌ప‌డ్డారు. గోస్వామితో పాటు సునీతా రాజ్ వ‌ర్ ప్ర‌ధాన పాత్ర పోషించారు.

ష‌హనా గోస్వామి సినిమాలో సంతోష్ గా న‌టించారు. ఈ సినిమా ఎంపిక ఎలా అంటే? కేన్స్ ఫిల్మ్ పెస్టివ‌ల్స్ల్ లో ఈసినిమా ఆన్ స‌ర్టైన్ రికార్డులో ప్ర‌ద‌ర్శించ‌బ‌డింది. అక్క‌డ భారీ స్థాయిలో విడుద‌ల‌వ్వ‌డం బ్రిటీష్ నిర్మాత‌ల మ‌ద్ద‌తు ద‌క్క‌డంతో సంతోష్ మూవీ యూకే నుంచి ఆస్కార్ కి నామినేట్ అయింది. ఈసినిమా క‌థేంటంటే?.. ఉత్త‌ర‌భార‌తేద‌శంలోని ఓ ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగుతుంది.

కొత్త‌గా పెళ్లైయిన ఓ మ‌హిళ సంతోష్ (గోస్వామి) కొంత కాలం త‌ర్వాత ఆమె భ‌ర్త చ‌నిపోవ‌డంతో ఒక ప్ర‌భుత్వ ప‌థ‌కం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగం పొందుతుంది. ద‌ళిత కులానికి సంబంధించిన అమ్మాయి హ‌త్య కేసును చేధించే క్ర‌మంలో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వచ్చాయి? అనే ఆస‌క్తిక‌ర క్రైమ్ స్టోరీ అల్లారు. వివ‌క్ష కార‌ణంగా స‌మాజంలో మ‌హిళలు ఎలా వేధించ‌బ‌డుతున్నారు? ఇలాంటి విష‌యాల‌ను సంతోష్ ఎలా వెలుగులోకి తెచ్చింది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మలిచారు.

Tags:    

Similar News