సోఫాలో తారా జువ్వులా సారా!

టోట‌ల్ గా 2024 లో ఐదు సినిమాల‌తో కుర్ర భామ‌ల్లో తానెంత బిజీగా ఉంద‌న్న సంగ‌తి ఆ ర‌కంగా చెప్ప‌క‌నే చెబుతుంది.

Update: 2024-08-24 02:45 GMT

బాలీవుడ్ లో ప‌టౌడీ వార‌సురాలు సారా అలీఖాన్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డి కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోంది. ఇప్ప‌టికే రెండు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రో మూడు సినిమాల‌తో ఇదే ఏడాది అల‌రించడానికి రెడీ అవుతుంది. టోట‌ల్ గా 2024 లో ఐదు సినిమాల‌తో కుర్ర భామ‌ల్లో తానెంత బిజీగా ఉంద‌న్న సంగ‌తి ఆ ర‌కంగా చెప్ప‌క‌నే చెబుతుంది.


కొన్ని కొత్త అవ‌కాశాలు క్యూలో ఉన్నాయి. స‌మ‌యం క‌లిసొస్తే స్నేహితురాలు జాన్వీ క‌పూర్ త‌ర‌హాలో టాలీవుడ్ లోనూ లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది. స‌రైన ఛాన్స్ రావాలేగానీ అమ్మ‌డు కూడా రెడీగానే ఉంది. ఇప్ప‌టికే డాడ్ సైఫ్ అలీఖాన్ సౌత్ సినిమాలు టార్గెట్ గా ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల్లో భాగ‌మ‌వుతున్నారు. ఇదే ఇమేజ్ తో డాట‌ర్ ని లాంచ్ చేయాల‌ని సైఫ్ భావిస్తున్నాడు. మ‌రి అది ఈ ఏడాది జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.


ఇక సారా బ్యూటీ సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెట్టించిన ఉత్సాహంతో కొత్త ఫోటోల‌తో కుర్ర‌కారుని అల‌రిస్తుంది. డిజైన‌ర్ దుస్తుల‌తో పాటు సంప్ర‌దాయ చీరందంలో త‌ళుక్కున మెరుస్తుంటుంది. ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో నిరంత‌రం సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది.


తాజాగా అమ్మ‌డు జీన్స్ డిజైన్ ఔట్ ఫిట్ లో త‌ళుక్కున మెరిసింది. మోకాళ్ల నుంచి పాద‌ల వ‌ర‌కూ మ్యాచింగ్ జీన్స్ సాక్సులు...షూస్ ధ‌రించింది. సోఫాలో వివిధ భంగిమ‌ల్లో కెమారాకి ఫోజులిచ్చింది. అంతే కాదు వివిధ ర‌కాల దుస్తుల బ్రాండ్ ని ప్ర‌మోట్ చేస్తూ త‌న‌మైన మార్క్ బ్యూటీని హైలైట్ చేసింది. అన్నింటికి బ్యాక్ గ్రౌండ్ లొకేష‌న్ మాత్రం కామ‌న్ గా ఒక‌టే క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Tags:    

Similar News