సరిపోదా శనివారం… బాక్సాఫీస్ లెక్క ఎలా ఉందంటే?
వరల్డ్ వైడ్ గా 52.18 కోట్ల గ్రాస్ మొదటి మూడు రోజుల్లోనే సరిపోదా శనివారం సినిమా వసూలు చేసినట్లు చిత్ర నిర్మాత పోస్టర్ రిలీజ్ చేశారు.
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన సరిపోదా శనివారం మూవీ థియేటర్స్ లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నాని కెరియర్ లోనే జెట్ స్పీడ్ తో ఈ సినిమా కలెక్షన్స్ జోరు కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఓ వైపు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ వర్షాల ప్రభావం సినిమాపై కొంత గట్టిగానే ఉంది.
వరల్డ్ వైడ్ గా 52.18 కోట్ల గ్రాస్ మొదటి మూడు రోజుల్లోనే సరిపోదా శనివారం సినిమా వసూలు చేసినట్లు చిత్ర నిర్మాత పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిని బట్టి అత్యంత వేగంగా 50 కోట్ల క్లబ్ లో చేరిన టైర్ 2హీరోగా నాని నిలిచాడు. సరికొత్త పాయింట్ తో ఈ మూవీ కథాంశాన్ని వివేక్ ఆత్రేయ చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి జనాల్లోకి బలంగా పంపించడంతో రిలీజ్ కి ముందు నుంచే మూవీపైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ వస్తున్నాయి.
మొదటి రోజు కంటే అత్యధిక కలెక్షన్స్ మూడో రోజు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆదివారం కూడా భారీ కలెక్షన్స్ ని అందుకొని ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరో వైపు ఓవర్సీస్ లో కూడా సరిపోదా శనివారం సినిమా అద్భుతమైన కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర పరుగులు పెడుతోంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే 1.6 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకొని ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేసింది.
ఈ విషయాన్ని పోస్టర్ తో చిత్ర నిర్మాత అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఓవర్సీస్ లో ఆదివారం నుంచి వచ్చే కలెక్షన్స్ అన్ని కూడా ప్రాఫిట్ లోకి కౌంట్ అవుతాయని తెలుస్తోంది. ఇదే స్పీడ్ లో ప్రేక్షకాదరణ లభిస్తూ ఉంటే లాంగ్ రన్ లో కచ్చితంగా 4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ఓవర్సీస్ మార్కెట్ లో సరిపోదా శనివారం అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. వరల్డ్ వైడ్ గా కూడా కలెక్షన్స్ పరంగా దసరా మూవీ పేరు మీద ఉన్న 113 కోట్ల కలెక్షన్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
సినిమాలో ప్రతినాయకుడిగా ఎస్ జె సూర్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే నాని కూడా తన క్యారెక్టర్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ తరహాలో సాగే పోటీని చూడటానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.