శనివారం ఫైట్ - నరకాసురుడు Vs శ్రీకృష్ణుడు

ఈరోజు(ఆగస్టు 20) శనివారం కావడం, అందులోనూ ఎస్‌జె సూర్య పుట్టినరోజు కావడంతో.. ఆయనకు బర్త్ డే విషెస్ అందజేస్తూ 'సరిపోదా శనివారం' నుంచి మేకర్స్ ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Update: 2024-07-20 07:07 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సరిపోదా శనివారం''. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్‌జె సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్.. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం మరో సర్ప్రైజింగ్ కంటెంట్ ను రిలీజ్ చేసారు.

ఈరోజు(ఆగస్టు 20) శనివారం కావడం, అందులోనూ ఎస్‌జె సూర్య పుట్టినరోజు కావడంతో.. ఆయనకు బర్త్ డే విషెస్ అందజేస్తూ 'సరిపోదా శనివారం' నుంచి మేకర్స్ ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'ఇది టీజర్ కాదు' అంటూ వదిలిన ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది. ''పురాణాల్లో నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టేవాడు. అందుకే శ్రీకృషుడు సత్యభామతో కలిసి..'' అంటూ నాని హిందీలో చెప్పే వాయిస్ ఓవర్ తో ఈ వీడియో ప్రారంభమైంది.

రావణాసురుడుగా, ప్రజలను హింసించే క్రూరమైన పోలీసాఫీసర్ గా ఎస్ జె సూర్యను పరిచయం చేసారు. అతన్ని ఎదుర్కోవడానికి శ్రీకృష్ణుడు (నాని) తన సత్యభామ (ప్రియాంక మోహన్)తో కలిసి వస్తున్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. సమాజంలో బలహీనులపై రాక్షసుల్లాంటి మనుషులు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు, వారిని ఎదుర్కోడానికి శక్తివంతమైన మరో మనిషి పుట్టుకొస్తాడు అనే సందేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇది సినిమాలో నాని - సూర్య లాంటి ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తుల మధ్య యుద్దాన్ని సూచిస్తుంది. ఇక చివర్లో నాని రౌడీలను కొట్టిపడేసి, 'హ్యాపీ బర్త్ డే సార్' అని చెప్పడంతో ఈ వీడియో ముగిసింది.

ఇందులో ఎస్.జె సూర్య జాలి దయలేని పోలీస్ గా, చాలా భయానకంగా కనిపించారు. నాని మరోసారి తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెరిశారు. ఇద్దరూ తమ పవర్-ప్యాక్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. 'నాట్ ఏ టీజర్' వీడియోతోనే దర్శకుడు తాను ఎలాంటి కథను చెప్పబోతున్నారనే విషయాన్ని తనదైన శైలిలో శాంపిల్ గా చూపించారు. దీనికి సినిమాటోగ్రాఫర్ మురళి.జి అందించిన విజువల్స్.. మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన జేక్స్ బిజోయ్ ఇంటెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేయగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చేస్తున్నారు.

'సరిపోదా శనివారం' చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 29వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 'దసరా' 'హాయ్ నాన్న' చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకున్న నాని.. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News