తనయుడి సినిమాలో గాయని గెస్ట్!
టీవీ షోలు...హోస్ట్ బాధ్యతలు..తోటి గాయకులతో కలిసి పాటలు పాటడం వరకే కెరీర్ ని పరిమితం చేసారు
టాలీవుడ్ సింగర్ సునీత్ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ మెప్పించారు. నవతరం గాయనీ మణులకు ఆదర్శంగానూ నిలుస్తున్నారు. రెండు..మూడు షార్ట్ ఫిల్మ్స్ లోనూ లీడ్ రోల్స్ పోషించారు. కానీ ఇంతవరకూ ఏ సినిమాలోనూ నటించింది లేదు. నటిగా ఆమెకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమా అనే కెమెరా ముందుకు వెళ్లకుడదని బలమైన నిర్ణయంతో ఆ దిశగా కెరీర్ ని ముందుకు తీసుకెళ్లలేదు.
టీవీ షోలు...హోస్ట్ బాధ్యతలు..తోటి గాయకులతో కలిసి పాటలు పాటడం వరకే కెరీర్ ని పరిమితం చేసారు. అయితే సునీత కుమారుడు ఆకాష్ 'సర్కారు నౌకరి' అనే సినిమాతో హీరోగా పరిచయమ వుతున్నాడు. ఈ సినిమాతో కొంత మంది కొత్త వాళ్లు పరిచయమవుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఆర్ కె. టెలి షో తాపకంపై దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం. ఆయన చాలా కాలం తర్వాత నిర్మాతగా పనిచేస్తున్నారు. చివరిగా 2004లో 'బొమ్మలాట' చిత్రాన్ని నిర్మించారు.
ఆ తర్వాత నిర్మాణం చేపట్టలేదు. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే సమర్పకుడిగానూ పలు సినిమాలకు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సునీత కుమారుడిని తన సంస్థ ద్వారా పరిచయం చేసే బాద్యత తీసుకోవడం విశేషమని చెప్పాలి. ఆరకంగా ఆకాష్ లక్కీ అనే అనాలి. దర్శకేంద్రుడి బ్యానర్లో సినిమా అంటే మాటలు కాదుగా. పెద్ద ఎత్తున సినిమా రిలీజ్ అవుతుంది.
రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు ఉండవు . ఆరకంగా లైన్ క్లియర్ గా ఉంది. మరి ఈ దిగ్దర్శకుడి నిర్మాణంలో సునీత రోల్ పోషిస్తున్నారా? అది గెస్ట్ రోల్ అయినా అభిమానులు సంతోషపడతారు. కుమారుడితో తెరను పంచుకునే అవకాశం ఉంది. మరి అటు కుమారుడు..ఇటు రాఘవేంద్ర రావు నిర్మాణంలో సునిత సైలెంట్ గా ఏదైనా రోల్ తో సర్ ప్రైజ్ చేసే అవకాశం ఉందేమో చూడాలి.