కూతురుని చంపాలనుకున్న హీరోయిన్‌!

సెలబ్రిటీలు కూడా సామాన్యుల మాదిరిగానే చిన్న విషయాలకు కూడా ఒత్తిడి ఫీల్‌ అవుతారు

Update: 2024-07-03 10:44 GMT

సెలబ్రిటీలు కూడా సామాన్యుల మాదిరిగానే చిన్న విషయాలకు కూడా ఒత్తిడి ఫీల్‌ అవుతారు. సెలబ్రిటీలు, హీరోయిన్స్ అయినంత మాత్రాన వారు చాలా సంతోషంగా ఉంటారు, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చాలా మంది అనుకుంటారు. కానీ వారికి కూడా చాలా సమస్యలు ఉంటాయి, వారు ఎదుర్కొనే ఒత్తడి ఉంటుంది.

ఆడవారిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ పెరిగి పోతుంది. గర్భం దాల్చిన తర్వాత కొందరిలో ఇది మొదలు అయితే, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చాలా మంది ఈ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ విషయం ను అంతర్జాతీయ ఆరోగ్య కేంద్రాలు కూడా ధృవీకరించాయి.

ఇటీవల పాకిస్తానీ హీరోయిన్‌ సర్వత్‌ గిలానీ పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ గురించి షాకింగ్‌ విషయాలు వెళ్లడించింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన డెలివరీ సమయంలో పెద్ద ఆపరేషన్ చేయడం వల్ల నాలుగు రోజుల పాటు నా బిడ్డను ఎత్తుకోలేక పోయాను.

ఆ సమయంలో నేను పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాను, తను పాలు తాగేందుకు చాలా ఇబ్బంది పడింది. అప్పుడే నాకు ఆత్మహత్య చేసుకోవాలి అనిపించింది, లేదంటే పాపకు హాని చేయాలని అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని నా భర్త తో షేర్‌ చేసుకున్నాను.

ఆయన నాకు మద్దతుగా నిలిచాడు. మొదట నన్ను పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్ గురించి తెలుసుకోమన్నాడు. ఆ తర్వాత దాని నుంచి బయట పడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆలోచన విధానం గురించి తెలియజేశాడు. అలా నేను ఆ సమస్య నుంచి బయట పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News

eac