బాక్సాఫీస్.. కాజల్ కూడా తప్పుకుందిగా..

అలాగే సుధీర్ బాబు హరోంహర, కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాలు కూడా మే 31న రిలీజ్ కావాల్సిన సినిమాలు.

Update: 2024-05-21 13:20 GMT

ఈ నెల 31న టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అదే డేట్ కి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అలాగే కార్తికేయ భజే వాయువేగం మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. ఆనంద్ దేవరకొండ గంగం గణేశా మూవీ చాలా వెయిటింగ్ తర్వాత మే 31న ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సుధీర్ బాబు హరోంహర, కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాలు కూడా మే 31న రిలీజ్ కావాల్సిన సినిమాలు.

ఇవన్నీ మీడియం రేంజ్ సినిమాలే కావడం విశేషం. అయితే హీరోల పరంగా చూసుకుంటే విశ్వక్ సేన్ కొంత పబ్లిక్ అటెన్షన్ ని గ్రాబ్ చేసే స్థాయిలో ఉన్నాడు. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీపైన కూడా పాజిటివ్ వైబ్ ఉంది. అసలే పబ్లిక్ సినిమాలు చూడటానికి థియేటర్స్ కి రావడం తగ్గించేశారు. ఇలాంటి పరిస్థితి ఒకే రోజు ఏకంగా ఐదు సినిమాలు అంటే ఎవరికి అంత శ్రేయస్కరం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకొని కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు.

ఇప్పటికే సుధీర్ బాబు హరోంహర సినిమాని వాయిదా వేసుకున్నారు. జూన్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు మే 31 రేసు నుంచి కాజల్ అగర్వాల్ కూడా వెనక్కి తగ్గింది. తాను లీడ్ రోల్ లో చేస్తోన్న సత్యభామ మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 7న సత్యభామ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట.

సత్యభామ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత కాజల్ అగర్వాల్ చేస్తోన్న మూవీ కావడంతో కొంత హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ లో కాజల్ అగర్వాల్ బిజీగా ఉంది.. అయితే మూవీ రిలీజ్ వాయిదా పడిన విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.

హరోంహర, సత్యభామ వాయిదా పడితే మే 31న పోటీలో మూడు సినిమాలు ఉంటాయి. వీటిలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో టాలీవుడ్ కి చెప్పుకోదగ్గ సక్సెస్ లు లేవు. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న మూవీస్ సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి. మరి మే 31న రిలీజ్ కాబోయే సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News