తెలుగు డిజిటల్ ప్రపంచంలో కుమ్మేస్తున్న డబ్బింగ్ మూవీ

కానీ ఎప్పుడైతే ఓటీటీ ద్వారా వచ్చిందో అప్పటి నుంచి టాప్‌ లో ట్రెండ్‌ చేస్తూ మరీ తెలుగు ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు.

Update: 2024-10-28 10:34 GMT

తెలుగు ప్రేక్షకులకు థియేటర్‌ల ద్వారా వచ్చిన సినిమాలను ఏ స్థాయిలో ఆధరిస్తున్నారో.. అదే స్థాయిలో ఓటీటీ ద్వారా వచ్చిన సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు. కొన్ని సినిమాలు ఏవో కారణాల వల్ల థియేట్రికల్‌ రిలీజ్ తో మెప్పించలేక పోయినా ఓటీటీ ద్వారా కుమ్మేస్తున్నాయి. ఇటీవల విడుదల అయిన సత్యం సుందరం సినిమా థియేట్రికల్‌ రిలీజ్ అయిన సమయంలో తెలుగు ప్రేక్షకులు లైట్‌ తీసుకున్నారు. ఆ సమయంలో ఉన్న పోటీ, ఇతర సినిమాల కారణంగా థియేటర్‌ కు ఎక్కువ వెళ్లి చూడలేదు. కానీ ఎప్పుడైతే ఓటీటీ ద్వారా వచ్చిందో అప్పటి నుంచి టాప్‌ లో ట్రెండ్‌ చేస్తూ మరీ తెలుగు ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు.

తమిళంలో ప్రేమ్‌ కుమార్ దర్శకత్వంలో రూపొందిన మెయ్యజగన్ సినిమాను తెలుగు లో సత్యం సుందరం అనే టైటిల్‌ తో విడుదల చేయడం జరిగింది. తెలుగు లో అదే సమయంలో ఒక భారీ సినిమా విడుదల ఉండటంతో సత్యం సుందరం సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వలేదు. తెలుగు లో నిరాశ పరచినా తమిళ్‌ లో మాత్రం ఈ సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. 96 సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ మరోసారి ఎమోషనల్‌ మూవీతో ఆకట్టుకున్నాడు. ఆయన మార్క్‌ మేకింగ్ మిస్ అవ్వకుండా, ఎమోషన్స్ ను పండిస్తూ చేసిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.

తెలుగులో పెద్ద సినిమా వల్ల థియేటర్‌లో చూడలేక పోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ మొదలు అవ్వడంతో ఒక్కసారిగా అంతా చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ఇటీవలే ఈ సినిమా స్ట్రీమింగ్‌ ప్రారంభం అయింది. జాతీయ స్థాయిలో ఈ సినిమా ట్రెండ్‌ అవుతుందని స్వయంగా నెట్‌ ఫ్లిక్స్ ప్రకటించింది. హిందీ సినిమాలతో పాటు ఇతర సినిమాలను పక్కకు నెట్టి మరీ అత్యధికంగా ఈ సినిమాను చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు సత్యం సుందరం సినిమాను ఎక్కువగా చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

తమిళ్‌ ప్రేక్షకులు ఎలాగూ థియేటర్‌ లో చూశారు.. కనుక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఓటీటీ ప్లాట్‌ ఫామ్ ద్వారా చూస్తున్నారు. రికార్డ్ స్థాయిలో స్పందన వస్తుందని, తెలుగు ప్రేక్షకులు జాతీయ స్థాయిలో సత్యం సుందరం సినిమాను ట్రెండ్‌ చేస్తున్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా నెట్‌ ఫ్లిక్స్ ప్రకటించడం జరిగింది. థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో పట్టించుకోని అదే ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ద్వారా బ్రహ్మరథం పడుతున్నారు. కార్తీ, అరవింద్‌ స్వామి నటనకు ప్రశంసలు కురిపిస్తూ, సినిమాకు సంబంధించిన చిన్న చిన్న షార్ట్‌ వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఆధరిస్తూ ఉన్నారు. మరోసారి కార్తీకి తెలుగు లో మంచి హిట్‌ పడ్డట్లుగా చెప్పుకుంటూ ఉన్నారు.

Tags:    

Similar News