'స్కామ్ 2003 ది తెల్గి స్టోరీ' ట్రైలర్ ఇంట్రెస్టింగ్
హన్సల్ మెహతా నుంచి వస్తున్న మరో స్కామ్ బేస్డ్ మూవీ 'స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ'. తాజా వెబ్ సిరీస్ కొంతకాలంగా ప్రజల్లో వేడి పెంచుతోంది.
హర్షద్ మెహతా స్కామ్ (స్కామ్ 1992)ని తెరకెక్కించిన హన్సల్ మెహతా నుంచి వస్తున్న మరో స్కామ్ బేస్డ్ మూవీ 'స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ'. తాజా వెబ్ సిరీస్ కొంతకాలంగా ప్రజల్లో వేడి పెంచుతోంది. 30,000 కోట్ల విలువైన భారతదేశపు అతిపెద్ద స్టాంప్ పేపర్ స్కామ్ వెనుక ఉన్న వ్యక్తి అబ్దుల్ కరీం తేల్డీ కథను విజువల్ గా ఆవిష్కరించారు.
తెలివైన వాడు .. చురుకైనవాడు.. పాములాంటోడు.. అంటూ తేల్గి గురించి ఇంట్రడక్షన్ .. అటుపై అతడి స్కామ్ లో డెప్త్ గురించి చాలా సంగతులే ఈ సినిమాలో చూపిస్తున్నారు. తెల్గి గురించి మాట్లాడే విభిన్న వాయిస్ ఓవర్‌లతో ట్రైలర్ ప్రారంభమైంది. తెల్గీ స్వయంగా ఒక హీరోగా పరిచయం అవుతున్నాడు. తేజైసే ఆప్ కయ్దే కి భాషా సమాజ్తే హో, వైసే మెయిన్ ఫైదే కీ భాషా సమజ్తా హూన్ (మీకు చట్టంలోని భాష అర్థమైంది.. నాకు లాభం అనే భాష అర్థమైంది వంటి లైన్స్ వినిపించాయి) అంటూ తేల్గీ డైలాగ్ నెట్ లో వైరల్ గా మారుతోంది.
ఈ వెబ్ సిరీస్ తో నటుడు గగన్ దేవ్ రియార్‌కు గొప్ప పరిచయంగా ఉపయోగపడుతుంది. అతను ట్రైలర్‌లో చాలా సన్నివేశాల్లో తేల్గీని తలపిస్తూ హృదయాలను గెలుచుకుంటున్నాడు. మొదటి సీజన్‌కు హన్సల్ మెహతా స్వయంగా దర్శకత్వం వహించగా... స్కామ్ 2003కి ఆయన నిర్మాత మాత్రమే. తుషార్ హీరానందాని దర్శకత్వం వహించారు. తెల్గీ స్టాంప్ పేపర్‌లను ఎలా నకిలీ చేశాడో టీజ్ చేస్తూ తాజాగా రివీల్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. షాహిద్ కపూర్ - విజయ్ సేతుపతి నటించిన రాజ్ & డీకే 'ఫర్జీ'ని ఇది గుర్తు చేస్తోంది. అచింత్ థక్కర్ స్వరపరిచిన స్కామ్ థీమ్ ఆకట్టుకుంటోంది.
హన్సల్ అతడి కుమారుడు జై సహా-దర్శకత్వం వహించిన మొదటి సీజన్ 'స్కామ్ 1992- హర్షద్ మెహతా స్టోరి' ప్రతీక్ గాంధీని ఓవర్‌నైట్ స్టార్ ని చేసింది. మహాత్మా గాంధీ జీవిత కథతో రూపొందనున్న కొత్త సిరీస్ కోసం దర్శక ద్వయంతో ప్రతీక్ మళ్లీ కలుస్తున్నారు. స్కామ్ 1992తో తన కెరీర్ లో కొత్త హైట్స్ చూసిన కొన్ని సంవత్సరాల తర్వాత హన్సల్ చాలా బిజీగా ఉన్నాడు. అతను ఫరాజ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆపై కరిష్మా తన్నా నటించిన నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ డ్రామా స్కూప్ కి దర్శకత్వం వహించారు. స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ సెప్టెంబర్ 1న SonyLIVలో విడుదల అవుతుంది.