టెక్నాల‌జీకి భ‌య‌ప‌డి లాయ‌ర్‌ని పెట్టుకున్న న‌టి!

ఓపెన్ ఏఐ- చాట్ జిపిటి వంటి అధునాతన సాంకేతికత‌ మ‌నిషి జీవ‌నవిధానంలో పెన‌వేసుకుపోతున్న‌ సంగ‌తి తెలిసిందే.

Update: 2024-05-21 17:30 GMT

ఓపెన్ ఏఐ- చాట్ జిపిటి వంటి అధునాతన సాంకేతికత‌ మ‌నిషి జీవ‌నవిధానంలో పెన‌వేసుకుపోతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఉద్యోగ‌- ఉపాధి అవ‌కాశాల‌పై వీటి ప్ర‌భావం తీవ్రంగా ఉంది. పెరిగిన సాంకేతిక‌త‌ పెను స‌మ‌స్య‌ల‌కు కార‌ణమ‌వుతోంది. అచ్చంగా మ‌నిషిని పోలిన మ‌నిషిని సృష్టించ‌డం, ఫేక్ వాయిస్‌ల క్రియేటివిటీతో చాలా ముప్పును ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అలాగే ఒక మ‌నిషి స్వ‌రాన్ని ఇంచుమించు అలానే ఉండేలా ఇమ్మిటేట్ చేసే ఏఐ సాంకేతిక‌త గురించి ఇటీవ‌ల చ‌ర్చ సాగుతోంది. ఇప్పుడు అలాంటి ఒక సాంకేతిక‌త త‌న‌ను తీవ్రంగా షాక్ కి గురి చేసింద‌ని చెబుతోంది హాలీవుడ్ న‌టి స్కార్లెట్ జాన్స‌న్.

మ‌న‌మంతా డీప్‌ఫేక్‌లతో స‌మ‌స్య‌ల్లో ప‌డుతున్నాం. మనల‌ను పోలి ఉండేవారిని సృష్టిస్తున్నారు. దీనివ‌ల్ల మ‌న‌ల్ని మ‌నం రక్షించుకోవడం కోసం, మ‌న గుర్తింపును కాపాడుకోవ‌డం కోసం పోరాడాల్సొస్తోంది. నాకు స్ప‌ష్ఠ‌త కావాల‌ని అడుగుతున్నాను. నేను పారదర్శకత రూపంలో తీర్మానంతో పాటు, వ్యక్తిగత హక్కులు రక్షించుకోవ‌టానికి సహాయపడే తగిన చట్టాల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాను! అని జాన్సన్ త‌న సోష‌ల్ మీడియాలో రాశారు. ఏఐ- చాట్ జిపిటి వంటి సాంకేతిక‌త‌కు హ‌ద్దులు ఏర్పాటు చేయ‌డానికి చ‌ట్టం రావాల్సిన‌ అవ‌స‌రాన్ని స్కార్లెట్ నొక్కి చెప్పారు.

ఇంత‌కుముందు చాట్ జిపిటికి అప్‌డేట్‌ను విడుదల చేసినప్పుడు ఓపెన్‌ఏఐ తన (స్కార్లెట్) స్వరాన్ని పోలి ఉండే సింథటిక్ వాయిస్‌ని ఉపయోగించ‌డంతో షాక్‌కు గుర‌య్యాన‌ని స్కార్లెట్ తెలిపారు. స్కై అనే సాంకేతిక‌త‌ను చాట్ జిపిటి ఉప‌యోగించింద‌ని కూడా తెలిపారు. కానీ త‌న వాయిస్ స్ప‌ష్ఠ‌తను కోల్పోయింద‌ని అన్నారు. స్కార్లెట్ జాన్స‌న్ మాట్లాడుతూ.. ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్, చాట్ జిపిటి 4.0 సిస్టమ్‌కు వాయిస్‌ని ఇవ్వడానికి గత సంవత్సర కాలానికి న‌న్ను నియమించుకోవాల‌నుకుంటున్న‌ట్టు ప్రతిపాదించారు.

వ్యక్తిగత కారణాలతో తాను ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు స్కార్లెట్ తెలిపింది. కానీ వారు సింథ‌టిక్ వాయిస్ ని ఉప‌యోగించ‌డం త‌న‌ని షాక్ కి గురి చేసింది. దీంతో తీవ్రంగా కోపానికి గురైన స్కార్లెట్ ఒక న్యాయ సలహాదారుని నియమించుకుంది. స్కార్లెట్ న్యాయవాది ఆల్ట్‌మన్‌కు రెండు లేఖలు పంపిన తర్వాత ఓపెన్‌-ఏఐ అయిష్టంగానే `స్కై` వాయిస్‌ని తీసివేయడానికి అంగీకరించిందని చెప్పారు. ఓపెన్ ఏఐ CEO చాట్‌జిపిటి 4.0 డెమో విడుదల చేయడానికి కేవలం రెండు రోజుల ముందు తన ఆఫర్‌ను పునఃపరిశీలించమని స్కార్లెట్ మేనేజర్‌ని సంప్రదించినట్లు కూడా తెలిపారు. స్కార్లెట్ జాన్స‌న్ గ‌తంలో తెలుగు- హిందీ చిత్ర‌సీమ‌లో ఐట‌మ్ నంబ‌ర్ల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News