కొత్త ఏడాదిలో కొత్త ట్రెండ్ లో హీరోలు!
మెగాస్టార్ చిరంజీవి..కింగ్ నాగార్జున..విక్టరీ వెంకటేష్...మాస్ రాజా రవితేజ లాంటి సీనియర్లు న్యూ ఇయర్ లో న్యూగా ఇంటర్ డక్షన్ ఇవ్వబోతున్నారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ ట్రెండ్ మార్చారు. కొత్త ఏడాదిలో కొత్త ట్రెండ్ తో మార్కెట్ లోకి రాబోతున్నారు. నేటి జనరేషన్ కి మేమేం తక్కువ కాదని నిరూపించడానికి రెడీ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే? ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు కూడా చేయని రిస్క్ సైతం చేస్తున్నారనొచ్చు. ఎందుకంటే పెద్దగా అనుభవం లేకపోయినా ఈ నయా స్టార్లు వాళ్లతో సినిమాల్ని పట్టాలెక్కించడమే ఓ ట్రెండ్ గా చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి..కింగ్ నాగార్జున..విక్టరీ వెంకటేష్...మాస్ రాజా రవితేజ లాంటి సీనియర్లు న్యూ ఇయర్ లో న్యూగా ఇంటర్ డక్షన్ ఇవ్వబోతున్నారు.
ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా 'బింబిసార' దర్శకుడు విశిష్టతో తన 156వ చిత్రాన్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. 'జగదీక వీరుడు అతిలోక సుందరి'..'అంజి' చిత్రాల తర్వాత చిరు సోషియో ఫాంటసీ చిత్రాల జోలికి వెళ్లింది లేదు. కొన్ని దశాబ్ధాల తర్వాత మళ్లీ వశిష్టతో అలాంటి ప్రయోగం చేస్తున్నారు. వశిష్ట కేవలం ఒక్క సినిమాకి మాత్రమే పనిచేసాడు. కానీ చిరంజీవి 150కి పైగా సినిమాలు చేసిన స్టార్ అతనితో పనిచేయడం అంటే? ఆయన లో మార్పు ఏ రేంజ్ కనిపిస్తుందో చెప్పొచ్చు.
ఇక కొత్త వాళ్లని ప్రోత్సహించడంలో కింగ్ నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. కానీ ఈసారి ఇంకా అడ్వాన్స్ గా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఏకంగా బిజయ్ బిన్ని అనే కొత్త కుర్రాడితో 'నా సామిరంగ' అనే సినిమా చేస్తున్నారు. ఇంతవరకూ విజయ్ బిన్నికి దర్శకత్వంలో ఎలాంటి అనుభవం లేదు. ఇదే తొలి సినిమా. కేవలం అతని కథ...ప్రతిభని మాత్రమే నమ్మి నాగ్ అవకాశం ఇచ్చారు. ఇక విక్టరీ వెంకటేష్ 74 సినిమాల్లో నటించి విక్టరీని క్రియేట్ చేసిన స్టార్. అలాంటి స్టార్ శేలేష్ కొలను లాంటి రెండు..మూడు సినిమాలు చేసిన దర్శకుడితోనే 'సైంధవ్' చేస్తున్నాడు.
అతడి ప్రతిభని గుర్తించి వెంకీ ఇచ్చిన ఛాన్స్ ఇది. అలాగే మాస్ రాజా వరుస పరాజయాల్లో ఉన్నా? కొత్త వాళ్లలో ఫైర్ ఉంటుందని కొంత కాలంగా వాళ్లతోనే ముందుకెళ్తున్నాడు. కెమెరా మ్యాన్ గా ఫేమస్ అయిన కార్తీక్ ఘట్టమనేని ఇంతకు ముందు ఒక సినిమానే చేసాడు. ఇప్పుడు రాజాతో 'ఈగిల్' చిత్రాన్ని తెరకెక్కి స్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఇది రిలీజ్ అవుతుంది. సినిమాపై మంచి అంచనాలు న్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు బజ్‌ని తీసుకొస్తున్నాయి. ఆ రకంగా సీనియర్ హీరోలంతా కొత్త ఏడాదిలో ట్రెండ్ మార్చి జర్నీ షురూ చేసారు. మరి సక్సెస్ మాట ఎలా ఉంటుందో చూడాలి.