రిచెస్ట్ స్టార్స్: ఆ ముగ్గురి నిక‌ర‌ ఆస్తి 14000 కోట్లు

ఆ ముగ్గురి ఆస్తి ఐశ్వ‌ర్యం, వ్యాపార ద‌క్ష‌త‌ గురించి ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్, హురూన్ వంటి సంస్థ‌లు అధ్య‌య‌నం చేసి గ‌తంలో సంపూర్ణ‌ వివ‌రాల్ని అందించాయి.

Update: 2025-02-10 04:34 GMT

భార‌త‌దేశంలోని ముగ్గురు అత్యంత ధ‌నిక స్టార్లు ఓచోట క‌లిసారు. బాక్సాఫీస్ శాస‌న‌క‌ర్త‌లుగా ద‌శాబ్ధాల పాటు బాలీవుడ్ ని ఏలిన‌ ఆ ముగ్గురూ ఎన్నో క్లాసిక్ హిట్స్ ని అందించారు. స్నేహితులు కింగ్ ఖాన్ షారూఖ్.. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్.. మేటి క‌థానాయిక జూహీ చావ్లా గురించే ఇదంతా. ఆ ముగ్గురూ ఇప్పుడు ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించారు. ఓ చోట క‌లిసి స‌ర‌దాగా గ‌డిపారు. అందుకు సంబంధించిన అరుదైన వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.


ఆ ముగ్గురి ఆస్తి ఐశ్వ‌ర్యం, వ్యాపార ద‌క్ష‌త‌ గురించి ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్, హురూన్ వంటి సంస్థ‌లు అధ్య‌య‌నం చేసి గ‌తంలో సంపూర్ణ‌ వివ‌రాల్ని అందించాయి. స‌ర్వేల‌ ప్ర‌కారం.. కింగ్ ఖాన్ షారూఖ్ నిక‌ర ఆస్తుల విలువ సుమారు 7300 కోట్లు. మేటి క‌థానాయిక జూహీ చావ్లా నిక‌ర ఆస్తి విలువ సుమారు 4600కోట్లు.. అమీర్ ఖాన్ నిక‌ర ఆస్తి-1900కోట్లు. ఈ ముగ్గురి నిక‌ర ఆస్తుల విలువ క‌లుపుకుని సుమారు 13,800 కోట్లు.

ఈ దిగ్గ‌జ‌ స్టార్లను క‌లిపిన‌ వేదిక -`ల‌వ్ యాపా` ప్రివ్యూ షో. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్- ఖుషి క‌పూర్ జంట‌గా న‌టించిన ఈ రొమాంటిక్ కామెడీని అమీర్ ఖాన్ తో పాటు షారూఖ్‌, జూహీ క‌లిసి వీక్షించారు. ``ఇది అరుదైన, విలువైన క్షణం`` అని జూహి చావ్లా తన సహనటులతో కలిసి గడిపిన అరుదైన‌ జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. జూహి చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లవ్‌యాపా షో నుండి కొన్ని ఫోటోల‌ను షేర్ చేసారు. అయితే ఈ ఆల్బ‌మ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విష‌యం పాత స్నేహితులు అమీర్ ఖాన్ , షారుఖ్ ఖాన్‌లతో క‌లిసి ఉన్న ఫోటో. ఆ ఫోటోలో జూహీ ఇద్దరు సూపర్‌స్టార్‌ల మధ్య పోజులిచ్చింది. ఆ ఫోటో అభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది.

త‌న కోస్టార్స్ షారూఖ్, అమీర్ ల‌ను ఇలా క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని జూహీ ఈ సంద‌ర్భంగా అన్నారు. వారితో క‌లిసి ప‌ని చేసాను. ఇద్దరు హీరోలు చాలాసార్లు సెట్స్‌లో న‌వ్వించారు.. ఏడిపించారు.. చాలా సూపర్ ఫన్ సినిమాలకు క‌లిసి ప‌ని చేసాం. అవి అంద‌మైన మ‌ర‌పురాని జ్ఞాపకాలు.. అని గుర్తు చేసుకున్నారు జూహీ. జునైద్ ని చిన్న పిల్లాడిగా ఉన్న‌ప్పుడు చూసాను! సంవత్సరాలు గడిచిపోయాయి ... అతడు చాలా అద్భుతమైన డౌన్-టు-ఎర్త్ బోయ్‌. దేవుడు అతన్ని దీవించుగాక. లవ్‌యప్పతో అతడు గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. అని ధీవించారు.

కింగ్ ఖాన్ షారూఖ్ తో క‌లిసి జూహీ చావ్లా ఆమె భ‌ర్త ప‌లు భారీ వ్యాపారాల్లో పెట్టుబ‌డిదారులు. భాగ‌స్వాములు క‌లిసి ఐపీఎల్ ఫ్రాంఛైజీని న‌డిపిస్తున్నారు. ప‌లు ఇతర విజ‌య‌వంత‌మైన వ్యాపార రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టారు. జుహీ చావ్లా షారుఖ్ ఖాన్‌తో డర్, డూప్లికేట్, రామ్ జానే, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ , యస్ బాస్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలలో నటించారు. కయామత్ సే ఖయామత్ తక్, లవ్ లవ్ లవ్, తుమ్ మేరే హో, హమ్ హై రహీ ప్యార్ కే, ఇష్క్ వంటి క్లాసిక్ హిట్ సినిమాలలో అమీర్ ఖాన్‌తో జూహీ స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. వారి అద్భుతమైన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని ఎప్ప‌టికీ యువ‌త‌రంలో హాట్ టాపిక్.

Tags:    

Similar News