తెలంగాణకు సూపర్‌స్టార్ ఫ్యాక్టరీ నుంచి స్కాచ్ దిగుమతి!
కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ ప్రణాళికలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అతడు తండ్రిలానే పెద్ద స్టార్ అవుతాడని అనుకుంటే, అందుకు భిన్నంగా దర్శకుడు అవుతున్నాడు
కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ ప్రణాళికలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అతడు తండ్రిలానే పెద్ద స్టార్ అవుతాడని అనుకుంటే, అందుకు భిన్నంగా దర్శకుడు అవుతున్నాడు. ప్రస్తుతం అతడు స్టార్ డమ్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు తన తండ్రి షారూఖ్ కి చెందిన భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించేందుకు అతడు సహకరిస్తున్నాడు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న లిక్కర్ బిజినెస్‌లోకి వచ్చాడు.
D’YAVOL పేరుతో ఆర్యన్ తన తండ్రితో కలిసి స్థాపించిన ప్రీమియం స్కాచ్ విస్కీ బ్రాండ్ ని ఇప్పుడు దేశంలోని అన్ని మెట్రోలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కేవలం ఈ బ్రాండ్ మహారాష్ట్ర, గోవాలో మాత్రమే లభ్యమవుతోంది. కర్నాటకలో కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా నగరాలకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిగా తెలంగాణలో అందుబాటులో వస్తుందని సమాచారం.
వరల్డ్ బెస్ట్ స్కాచ్:
ఇటీవలే `డి యవోల్ స్కాచ్` 2024 న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్ (NYWSC)లో అత్యున్నత గౌరవాలను అందుకోవడం ద్వారా ప్రపంచ గుర్తింపు పొందింది. ఖాన్ ల ఫ్లాగ్‌షిప్ విస్కీ బ్రాండ్ `డి యావోల్` ఇన్‌సెప్షన్.. బెస్ట్ ఓవరాల్ స్కాచ్ & బెస్ట్ ఆఫ్ క్లాస్ బ్లెండెడ్ మాల్ట్ స్కాచ్ విస్కీ అనే ప్రతిష్టాత్మక టైటిళ్లను కైవసం చేసుకుంది. నిజానికి న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్ స్పిరిట్స్ పరిశ్రమలో అత్యంత పాపులర్ ఈవెంట్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల ప్యానెల్ వరల్డ్ బెస్ట్ బ్రాండ్లను పరిశీలిస్తాయి. నిజాయితీ, నాణ్యత, ప్రామాణికత ఆధారంగా ఎంట్రీలను పరిశీలించి వాటికి ర్యాంకింగ్స్ ని ఇస్తుంది ప్యానెల్. ఈ పోటీలో `డి యవోల్` కారణంగా ఆర్యన్- షారూఖ్ పేర్లు మార్మోగాయి.
ధరలు హై ఎండ్‌లోనే..
ఖాన్‌ల స్కాచ్ బ్రాండ్ ఖరీదు ఎక్కువే. 750ఎంఎల్ స్కాచ్ మహారాష్ట్రలో రూ. 9,800 ధరకు అమ్ముతున్నారు. గోవాలో రూ. 9,000. కర్ణాటకలో రూ. 9,500 వరకూ ఉంది. ఇప్పటివరకూ పరిమిత ప్రదేశాలలోనే ఈ బ్రాండ్ ని అందుబాటులో ఉంచారు. ఇకపై అన్ని మెట్రో నగరాలకు మద్యం వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. లాభసాటిగా ఉండే స్కాచ్ వ్యాపారంలో షారూఖ్ వారసుడు ఆర్యన్ దూసుకుపోయే ప్రణాళికలను సిద్ధం చేసాడని తెలుస్తోంది.