షారుక్ 'జవాన్'.. ఈ ఛాన్స్ ను యూజ్ చేసుకుంటుందా?
తండ్ రీకొడుకుల పాత్రల్లో కనిపించారు. దీపికా పదుకొణె, నయనతార హీరోయిన్లుగా నటించిన జవాన్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయిన ఆ సినిమా.. షారుక్ కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన జవాన్ లో షారుక్ డ్యూయల్ రోల్స్ లో సందడి చేశారు. తండ్ రీకొడుకుల పాత్రల్లో కనిపించారు. దీపికా పదుకొణె, నయనతార హీరోయిన్లుగా నటించిన జవాన్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
అయితే జవాన్ మూవీ త్వరలో జపాన్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. నవంబర్ 29వ తేదీన విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను షారుక్ గురువారం పోస్టర్ రిలీజ్ చేశారు. జపనీస్ లాంగ్వేజ్ లో పూర్తి వివరాలతో ఉన్న పోస్టర్ ను షేర్ చేశారు. జపాన్ లో ఇండియన్ ఫిల్మ్స్ ను విడుదల చేసే ట్విన్ సంస్థ.. జవాన్ ను కూడా రిలీజ్ చేస్తుంది. జులై 5వ తేదీన ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టేసింది. జపనీయులు.. పోటీ పడి మరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారట.
ఇప్పుడు జపాన్ లో జవాన్ రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. జవాన్ కు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో దంగల్, బాహుబలి-2 టాప్ గ్రాసర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి-2.. రూ.1700 కోట్లకు పైగా వసూలు చేయగా.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ దంగల్ రూ.2000 కోట్ల వసూళ్లను అందుకుంది.
అలా ఇండియన్ టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో తొలి రెండు స్థానాల్లో దంగల్, బాహుబలి-2 ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 చిత్రాలు ఉన్నాయి. రూ.1100కు పైగా కోట్ల వసూళ్లతో జవాన్ ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు జపాన్ లో జవాన్ రిలీజ్ అవుతుండడంతో.. షారుక్ మూవీ కొన్ని స్థానాలు పైకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వెనక్కి నెట్టి ముందుకు కచ్చితంగా జవాన్ వెళ్లనుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
అదే సమయంలో జపాన్ లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ముత్తు, ఆర్ఆర్ఆర్, బాహుబలి2, దంగల్, 3 ఇడియట్స్ మూవీస్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు జవాన్ మంచి కలెక్షన్లు రాబడితే.. బాహుబలి2, దంగల్ చెంతకు జవాన్ కచ్చితంగా చేరుతుంది. చైనాలో కూడా జవాన్ విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. మరి షారుక్ ఖాన్ మూవీ జపాన్ లో ఎంత వసూలు చేస్తుందో? హెయెస్ట్ వసూళ్లు రాబట్టిన జాబితాల్లో ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.