షాకింగ్ : సెట్లో ఏడ్చేసిన స్టార్ హీరో

అలాగే సెట్ లో తాను ఏడ్చేసిన ఒక సంఘ‌ట‌న‌ను కూడా ఆయ‌న తాజా ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

Update: 2024-12-03 02:30 GMT

''మ‌గాళ్లు సేవ‌కులుగా..సంర‌క్ష‌కులుగా ఉండాల‌ని వ్య‌వ‌స్థ నిర్ధేశించింది. అది క‌చ్ఛితంగా వారిపై ఒత్తిడిని పెంచుతుంది'' అని అన్నారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షాహిద్ క‌పూర్. అలాగే సెట్ లో తాను ఏడ్చేసిన ఒక సంఘ‌ట‌న‌ను కూడా ఆయ‌న తాజా ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.


బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను చాలా అరుదుగా మాట్లాడుతుంటారు. కానీ ఇటీవలి ఇంటర్వ్యూలో తన భావోద్వేగ పోరాటాల గురించి ఓపెన‌య్యాడు. ఒక మ‌గ‌వాడిగా తాను చాలా ఒత్తిళ్ల‌ను ఎదుర్కొన్నాన‌ని అన్నాడు. భారతీయ పురుషులపై ఒత్తిడి గురించి అత‌డు వివ‌ర‌ణాత్మ‌కంగా మాట్లాడారు.

ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో త‌న మాజీ ప్రేయ‌సి కరీనా కపూర్ ఖాన్‌తో తన గత సంబంధంలో బ్రేక‌ప్ గురించి షాహిద్ గుర్తుచేసుకున్నాడు. బ్రేక‌ప్ త‌ర్వాత సెట్‌లో ఏడ్చేశాన‌ని.. గుండెపోటు వ‌చ్చినంత ప‌నయ్యింద‌ని అన్నాడు. కెరీర్ కారణంగా ఎప్పుడైనా ఒంటరిగా ఏడ్చారా? అని ప్ర‌శ్నించ‌గా వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో అలా జ‌రిగింద‌ని అన్నారు. సినిమాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు జరుగుతుంది. ఏడ్వ‌టం కొత్తేమీ కాదు అని కూడా తెలిపారు. మేక‌ప్ ఆర్టిస్ట్ ఎదుట అత‌డు ఎమోష‌న‌ల్ అయిన విష‌యాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. నన్ను నేను నాశనం చేసుకుంటున్నానని అనుకున్న‌ట్టు షాహిద్ గుర్తు చేసుకున్నారు.

భారతీయ పురుషులకు ప్రత్యేకించి ఒక కండిష‌న్ ఉంది. మీరు ప్రొవైడర్‌గా ఉండాలని, మీరు రక్షించాలని కుటుంబానికి పెద్ద మ‌నిషిగా ఉండాలని చాలా చిన్న వయస్సు నుండి స‌మాజం చెబుతుంది. ఈ గుణం పురుషులలో ఉంది. దేనిని ప్రేమిస్తున్నామో దానిని కాపాడాలి అని ఎల్లప్పుడూ ఆందోళన చెందుతాం. కొన్నిసార్లు ఇది చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. కొన్నిసార్లు విశ్రాంతి తీసుకోవాలనుకుంటాము.. అని కూడా షాహిద్ అన్నారు. ప్రతి ఒక్కరి గురించి ఎప్పుడూ చింతించాల్సిన అవసరం లేదని కూడా అన్నారు.

షాహిద్ త‌దుప‌రి 'దేవా' చిత్రంలో కనిపించబోతున్నాడు. ఇది 31 జనవరి 2025న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే ఇందులో క‌థానాయిక‌గా నటించారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించే కొత్త ప్రాజెక్ట్‌లోను షాహిద్ న‌టిస్తున్నాడు. ట్రిప్తి దిమ్రీ క‌థానాయిక‌.

Tags:    

Similar News