ఒకే ఏడాదిలో రెండు సార్లు 1000 కోట్లు!

దాంతో పాటు ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో కూడా ఇలా వెయ్యి కోట్లు కలెక్షన్స్ అధికమించి హీరోల జాబితాలో కూడా టాప్ లో నిలిచాడు

Update: 2023-09-25 13:30 GMT

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవరికి సాధ్యం కానీ రేర్ ఫీట్ ని షారుఖ్ ఖాన్ తన ఖాతాలో వేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి కింగ్ ఖాన్, బాద్ షా అని షారుఖ్ ని ఎందుకు అంటారో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అతను కరెక్ట్ గా కాన్సట్రేట్ పెడితే ఎలాంటి రికార్డులు అయిన బ్రేక్ అవ్వాల్సిందే అని పఠాన్, జవాన్ చిత్రాలతో నిరూపితం అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో పెత్తనం సినిమాతో బాలీవుడ్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్, కెరియర్ మొదటి వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాని ఖాతాలో వేసుకున్నారు.

ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఊపొచ్చింది. అంత వరకు వరుస డిజాస్టర్స్ తో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ కోలుకోవడానికి పఠాన్ కొంత కారణం అయ్యింది. ఈ మూవీ తర్వాత కొన్ని మంచి సినిమాలు అక్కడి నుంచి వచ్చాయి. మరల తాజాగా జవాన్ సినిమాతో మరోసారి వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టారు. దీంతో ఒకే ఏడాదిలో రెండు సార్లు వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన ఏకైక ఇండియన్ హీరోగా షారుఖ్ రికార్డ్ క్రియేట్ చేశారు.

దాంతో పాటు ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో కూడా ఇలా వెయ్యి కోట్లు కలెక్షన్స్ అధికమించి హీరోల జాబితాలో కూడా టాప్ లో నిలిచాడు. ఈ రేర్ ఫీట్ ని భవిష్యత్తులో కూడా ఎవరూ అందుకోలేకపోవచ్చు. వరుసగా రెండు సినిమాలతో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన దర్శకుడిగా రాజమౌళి పేరు వినిపిస్తే హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్ కనిపిస్తాడు.

ఇక జవాన్ మూవీ నెక్స్ట్ టార్గెట్ ఆర్ఆర్ఆర్ అని తెలుస్తోంది. గట్టిగా మరో పది రోజులు ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడితే ఈజీగా ఆ రికార్డుని కూడా బ్రేక్ చేయడంతో హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో టాప్ 3లోకి వచ్చి చేరవచ్చు. ఇది ఒక ఘనత అవుతుంది. జవాన్ తో మొత్తం ఇప్పటి వరకు 6 ఇండియన్ సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్ సాధించాయి.

అందులో మూడు బాలీవుడ్ ఉంటే రెండు చిత్రాలు షారుఖ్ ఖాన్ నుంచి వచ్చినవే కావడం విశేషం. ఈ ఏడాది రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో చేసిన డుంకీ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కూడా వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధిస్తే మాత్రం రేర్ ఫీట్ షారుఖ్ ఖాతాలో చేరుతుంది.

Tags:    

Similar News