శంకర్ సార్.. ఏందీ గందరగోళం?
అయితే శంకర్ మాత్రం.. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్‌లో ఫైనల్ కాపీ ఏది ముందు రెడీ అవుతుందో దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారట.
దిగ్గజ దర్శకుడు శంకర్ ఒకేసారి రెండు పడవల మీదు కాలేసి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్.. రెండు పాన్ ఇండియా చిత్రాలను ఒకేసారి హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్తున్నారు. కానీ ఈ చిత్రాల గురించి సరైన అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ 2 గురించి కొద్దో గొప్పో చెప్పారు కానీ గేమ్ ఛేంజర్ గురించే ఊసే ఉండట్లేదు.
అయితే రీసెంట్గా గేమ్ ఛేంజర్‌లోని జరగండి జరగండి సాంగ్ లీక్ అవ్వడంతో ఇప్పుడు దాన్ని దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు తాజాగా ఇండియన్ 2 పరిచయ టీజర్‌ను.. నవంబరు 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.
ఇండియన్ 2 టీజర్లో ఆ చిత్ర రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తారేమో అని అనుకుంటున్నారు. సంక్రాంతికైతే వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే ఆ బెర్త్‌లు ఫుల్ అయిపోయాయి. ఆగస్ట్ 15కు ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి పుష్ప 2 వస్తోంది కాబట్టి పోటీకి వెళ్లే అవకాశం ఉండదు. ఇకపోతే మిగిలింది 2024 సమ్మర్ లేదా దసరా.
ఒకవేళ ఇదే కనుక జరిగితే మరి గేమ్ ఛేంజర్ ఎప్పుడనేది క్లారిటీ రావాల్సి ఉంటుంది. కొంతమంది ఈ చిత్రం వచ్చే ఏడాది కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఇప్పుడు పాటను కూడా లీక్ అయింది కాబట్టి.. కేవలం కంటి తుడుపు కోసం రిలీజ్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఏది ఏమైనా వీలైనంత త్వరగా వీటి రిలీజ్ డేట్స్ గురించి ఓ క్లారిటీ వస్తే బాగుంటుంది. ఇతర నిర్మాతలు పోటీకి రాకుండా అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. అయితే శంకర్ మాత్రం.. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్‌లో ఫైనల్ కాపీ ఏది ముందు రెడీ అవుతుందో దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారట. అయితే ఇండియన్ 2నే ముందు వస్తుందని చెన్నై టాక్. చూడాలి మరి ఈ గందరగోళంపై వచ్చే వారంలోనైనా కొంతైనా క్లారిటీ వస్తుందేమో..