తాత ఫైటింగ్స్... శంకర్ సర్ లాజిక్ ఇదేనట!
దాదాపు అయిదు సంవత్సరాలుగా ఈ సినిమా వార్తల్లో నానుతూ వస్తుంది. వరుస యాక్సిడెంట్స్ తో పాటు వివాదాల కారణంగా ఈ సినిమా వచ్చే అవకాశాలు లేవని అంతా భావించారు.
తమిళ సినీ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'భారతీయుడు 2' జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు అయిదు సంవత్సరాలుగా ఈ సినిమా వార్తల్లో నానుతూ వస్తుంది. వరుస యాక్సిడెంట్స్ తో పాటు వివాదాల కారణంగా ఈ సినిమా వచ్చే అవకాశాలు లేవని అంతా భావించారు.
దర్శకుడు శంకర్, నిర్మాతల మధ్య ఉన్న విభేదాలను మధ్యవర్తుల సమక్షంలో పరిష్కరించుకోవడం తో మళ్లీ సినిమా మొదలు అయ్యింది, ఇప్పుడు విడుదలకు రెడీ అయ్యింది. గతంలో వచ్చిన భారతీయుడు కి సీక్వెల్ గా భారతీయుడు 2 ఉండబోతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పాత్రను భారతీయుడు 2 లో కొనసాగించారు. 2024 కి సేనాపతి వయసు 103 సంవత్సరాలు అవుతుంది. తాత వయసు ఉన్న వ్యక్తి కుర్రాళ్ల కంటే ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ చేయడం, ఫైట్స్ చేయడం ఏంటి అంటూ ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక వర్గం వారు విమర్శలు చేస్తున్నారు.
సేనాపతి మేకప్ తో పాటు, ఆయనతో అంతటి యాక్షన్ సీన్స్ చేయించడం సహజత్వానికి దూరంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ తాను రాసుకున్న కథకు మరియు సేనాపతి పాత్రకు లాజిక్ చెప్పాడు.
చైనా లో వంద ఏళ్లు దాటిన వారు కూడా మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్స్ గా ఉంటారు. వారు పాటించే పద్దతులు మరియు వారు అనుసరించే క్రమశిక్షణ కారణంగా ముసలి వయసులో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాగే సేనాపతి కూడా సూపర్ మ్యాన్. అందుకే ఆయన 103 ఏళ్లు అయినా కూడా యాక్షన్ చేశాడు అంటూ శంకర్ చెప్పే ప్రయత్నం చెప్పాడు.
సినిమా హిట్ అయితే ఇలాంటి లూప్ హోల్స్ ని ఎవరు పట్టించుకోరు. కానీ సినిమా విషయంలో ఫలితం కాస్త అటు ఇటు అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇప్పటి కంటే ఎక్కువగా ట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే సేనాపతి వయసు గురించి అసలు ముచ్చటే ఉండదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.