.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

అయ్యయ్యో శంకర్ ఎంత పని జరిగిందో..?

ఐతే శంకర్ సినిమాటిక్ యూనివర్స్ చేస్తే బాగుంటుందని.. అప్పుడు కాకపోయినా ఇప్పుడు ట్రై చేసినా శంకర్ యూనివర్స్ అదిరిపోతుందని అంటున్నారు ఆడియన్స్.

Update: 2024-06-29 15:30 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో కొనసాగుతున్న కొత్త ట్రెండ్. సినిమాటిక్ యూనివర్స్. కొన్ని పాత్రలను కొత్త కథలతో వరుస సినిమాలుగా చేస్తే అదే సినిమాటిక్ యూనివర్స్. హాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో కూడా కోనిపిస్తుంది. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఖైదీ, విక్రం సినిమాలతో ఈ యూనివర్స్ క్రేజ్ మొదలైంది. ఇక ఇదే క్రమంలో తెలుగు మేకర్స్ కూడా సినిమాటిక్ యూనివర్స్ చేస్తూ సత్తా చాటుతున్నారు.

లేటెస్ట్ గా కల్కి సినిమా వచ్చాక ఆ సినిమా సీక్వెల్స్ ఇంకే రేంజ్ లో ఉండబోతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే లోకేష్ కన్నా ముందు కాదు హాలీవుడ్ కన్నా ముందే ఈ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేయాలని అనుకున్నారట సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్. అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్లు కొట్టిన శంకర్ రోబో సినిమా టైం లోనే ఒక సినిమాటిక్ యూనివర్స్ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారట.

ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజి ఈ పాత్రలను కలిపి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నారట. ఐతే ఆ ఆలోచన తన అసిస్టెంట్ లతో చెబితే నవ్వేశారట. ఇదే విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పినా కూడా వాళ్లు కూడా అంత ఎంకరేజ్ చేయలేదట. అందుకే ఆ ఆలోచనని పక్కన పెట్టారట శంకర్. రీసెంట్ గా సౌత్ సినిమాల్లో సినిమాటిక్ యూనివర్స్ లు ఎక్కువ అవుతున్న సందర్భంగా శంకర్ తాను ఎప్పుడో ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నా కానీ కుదరలేదని చెప్పుకొచ్చారు.

Read more!

ఇక ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలతో వస్తున్నారు శంకర్. ఓ పక్క కమల్ తో ఇండియన్ 2 సినిమా చేస్తూ మరోపక్క చరణ్ తో గేమ్ చేంజర్ అంటూ వస్తున్నారు. ఇండియన్ 2 సినిమా నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ రిలీజ్ ఫిక్స్ చేశారు. చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు. ఐతే శంకర్ సినిమాటిక్ యూనివర్స్ చేస్తే బాగుంటుందని.. అప్పుడు కాకపోయినా ఇప్పుడు ట్రై చేసినా శంకర్ యూనివర్స్ అదిరిపోతుందని అంటున్నారు ఆడియన్స్. రాబోతున్న ఈ రెండు సినిమాలతో శంకర్ మరోసారి తన మార్క్ సెట్ చేయాలని చూస్తున్నారు. ఇండియన్ 2 ట్రైలర్ ఆల్రెడీ రిలీజై ఇంప్రెస్ చేయగా గేమ్ చేంజర్ మాత్రం భారీ టార్గెట్ తో వస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News