అందరూ విమర్శిస్తున్న ఈ నటి ఆస్తులు 53 వేల కోట్లు!
తాజాగా షర్మిన్ సెగల్ వ్యక్తిగత జీవితం కుటుంబం గురించి తెలుసుకుంటే షాకిచ్చే వివరాలు తెలిసాయి
సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అప్పటి నుండి అలంజేబ్ పాత్రను పోషించిన షర్మిన్ సెగల్ నటన పరంగా తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటోంది. అయితే షర్మిన్ సెగల్ అత్యంత ప్రతిభావంతులైన కళాకారుల కుటుంబానికి చెందినదనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా షర్మిన్ సెగల్ వ్యక్తిగత జీవితం కుటుంబం గురించి తెలుసుకుంటే షాకిచ్చే వివరాలు తెలిసాయి.
షర్మిన్ సెగల్ వివాహిత. తన భర్త అమన్ మెహతా నికర ఆస్తుల విలువ రూ. 53,800 కోట్లు. అతడు బిజినెస్ మ్యాగ్నెట్. 1995లో జన్మించిన షర్మిన్ సెగల్ ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ దీపక్ సెగల్ .. ఫిల్మ్ ఎడిటర్ బేలా సెగల్ కుమార్తె. షర్మిన్ సెగల్ తల్లి సంజయ్ లీలా భన్సాలీకి చెల్లెలు. భన్సాలీకి షర్మిన్ మేనకోడలు. షర్మిన్ తండ్రి తరపు తాత మోహన్ సెగల్ కూడా చిత్ర దర్శకుడిగా 40 ఏళ్ల కెరీర్‌ను కలిగి ఉన్నారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమ మాలిని, రేఖ, అశోక్ కుమార్, వైజంతిమాల, శశి కపూర్, మనోజ్ కుమార్ వంటి అగ్ర తారలతో సినిమాలు తీశాడు.
షర్మిన్ సెగల్ నవంబర్ 2023 నుండి టోరెంట్ గ్రూప్ విభాగమైన టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమన్ మెహతాను వివాహం చేసుకున్నారు. అమన్ మెహతా బిలియనీర్ వ్యాపార దిగ్గజం సమీర్ మెహతా కుమారుడు. అతడు తన సోదరుడు సుధీర్ మెహతాతో కలిసి టోరెంట్ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇది టోరెంట్ ఫార్మా, టొరెంట్ పవర్, టొరెంట్ కేబుల్స్, టొరెంట్ గ్యాస్ అండ్ టొరెంట్ డయాగ్నోస్టిక్స్‌తో కూడిన భారీ వ్యాపార సామ్రాజ్యం. అమన్ మెహతా కొలంబియా బిజినెస్ స్కూల్‌లో MBA పూర్తి చేసారు. USలోని బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
షర్మిన్ సెగల్ విషయానికొస్తే.. 18 సంవత్సరాల వయస్సులో సంజయ్ లీలా భన్సాలీకి 'గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా' సెట్స్ లో అసిస్టెంట్ గా సహాయం చేయడం ద్వారా చలనచిత్ర ప్రపంచంలోకి ప్రవేశించింది. 2019 చిత్రం 'మలాల్'లో కథానాయికగా ఆరంగేట్రం చేసింది. 'హీరామండి' షర్మిన్ కి మొదటి OTT సిరీస్. ఇకపైనా నటనారంగంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.