వ‌ర‌ల్డ్ టాప్ 50లో ఆసియా నం.1 స్టార్‌!

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఖండం -ఆసియా. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా.. అని చిన్న‌ప్పుడు సోష‌ల్ పుస్త‌కాల్లో చ‌దువుకున్నాం.

Update: 2023-12-18 04:25 GMT

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఖండం -ఆసియా. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా.. అని చిన్న‌ప్పుడు సోష‌ల్ పుస్త‌కాల్లో చ‌దువుకున్నాం. ఇప్పుడు అతి పెద్ద ఖండం అయిన ఆసియాలో నంబ‌ర్ -1 స్టార్ గా అవ‌త‌రించాడు కింగ్ ఖాన్ షారూఖ్‌. ప్ర‌పంచంలోని గొప్ప సెల‌బ్రిటీల్లో ఆసియా మొత్తానికి ఖాన్ నంబ‌ర్ వ‌న్ గా నిలిచాడు.


ప‌ఠాన్- జ‌వాన్ చిత్రాల‌తో 2023లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాలు అందుకున్న కింగ్ ఖాన్ ఇప్పుడు ఈ అరుదైన ఫీట్ ని సాధించాడు. శుక్రవారం టాప్ 50 బెస్ట్ స్టార్ల‌ అధికారిక జాబితాను విడుదల చేశారు. షారూఖ్‌ తర్వాత అలియా భట్ రెండో స్థానంలో నిలవగా, ప్రియాంక చోప్రా మూడో స్థానంలో నిలిచింది. ఆస‌క్తిక‌రంగా గ్లోబ‌ల్ స్టార్ గా ఉన్న ప్రియాంక చోప్రాను ఆలియా రేసులో వెన‌క్కి నెట్టింది. అలాగే ఆలియా భ‌ర్త‌, యానిమ‌ల్ హీరో ర‌ణ‌బీర్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

టాప్ 50 ఆసియా ప్రముఖుల్లో దిల్జిత్ దోసాంజ్, రణబీర్ కపూర్ కూడా టాప్ సెలెబ్స్‌లో ఉన్నారు. ఈ జాబితాను UK వారపత్రిక ఈస్టర్న్ ఐ ప్రచురించింది. షారుఖ్ గురించి స‌ద‌రు ప‌త్రిక కోట్ చేసిన అంశం నుంచి ఒక పాయింట్ ఇలా ఉంది. ``ఒక క్యాలెండర్ సంవత్సరంలో మూడు భారీ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్‌(పఠాన్-జ‌వాన్ ల‌తో టైగ‌ర్ 3 క‌లుపుకుని)లను సాధించిన ఆధునిక యుగం నుండి షారూఖ్ ఖాన్ మొదటి ప్రముఖ వ్యక్తి అవుతాడు. గ్లోబల్ ఆక‌ర్ష‌ణ‌తో భారీగా ప్రేక్షకులను సినిమా హాళ్లకు తిరిగి రప్పించడం ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. తీవ్ర క్షీణద‌శ‌లో ఉన్న బాలీవుడ్‌కు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాడు. ప‌రిశ్ర‌మ‌ పరివర్తన మోడ్ లోకి మారింది అత‌డి వ‌ల్ల‌. చరిత్ర సృష్టించిన సూపర్‌స్టార్ షారూఖ్‌ తన ప్రకాశంతో ఇత‌రులందరినీ వెన‌క్కి నెట్టాడు. ప్రపంచ ప్రేక్షకులకు పలాయనవాద బాలీవుడ్ సినిమా సామర్థ్యం ఏమిటో గుర్తు చేశాడు`` అని స‌ద‌రు ప‌త్రిక పేర్కొంది.

షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రం `డంకీ`లో కనిపించనున్నాడు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కూడా నటించారు. డిసెంబర్ 21న సినిమా విడుదల కానుంది.

ఈ జాబితా టాప్ సెలబ్రిటీలు, వృత్తిలో సహకారం, సరిహద్దులను బ్రేక్ చేయ‌డం.. సంవత్సరాలుగా స్ఫూర్తిదాయకంగా నిలిచే గొప్ప‌త‌నంపై ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా పాఠకులు తమకు ఇష్టమైన సెలబ్రిటీని జాబితా కోసం నామినేట్ చేయవచ్చు కాబట్టి ఇది ప్రజాభిప్రాయాన్ని కూడా కలిగి ఉంటుంది. ఖాన్ ని ఎక్కువమంది నామినేట్ చేసారు.

అలియా భట్ ఘ‌న‌త‌:

షారుఖ్ ఖాన్ తర్వాత హాలీవుడ్ లో న‌టించిన‌ అలియా భట్ రెండవ స్థానంలో ఉంది. హార్ట్‌ ఆఫ్‌ ద స్టోన్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆలియా క్రేజ్ ప్రియాంక చోప్రా కంటే ఎక్కువ‌గా ఉంద‌ని ఇది ప్రూవ్ చేసింది. భారీ ప్రాజెక్ట్‌లు-సిటాడెల్ - లవ్ ఎగైన్ స‌హా మానవతా ధృక్ప‌థంతో పీసీ చేసే పని, అంతర్జాతీయ ఈవెంట్‌లలో రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో షో స్టాప‌ర్ గా నిల‌వ‌డంతో పీసీ మూడవ స్థానంలో నిలిచింది.

గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ సినిమాలు అంతర్జాతీయ మ్యూజిక్ ఈవెంట్ల‌తో తాను చేసిన‌ పని గుర్తింపుతో నాల్గవ స్థానంలో నిలిచారు. దిల్జిత్ చివరిగా సియాతో కలిసి పని చేశాడు. అతడు కోచెల్లా ఉత్సవంలో తన నటనకు చ‌క్క‌ని గుర్తింపును పొందాడు. ఈ జాబితాలో రణబీర్ కపూర్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే ఆసియా లెవ‌ల్లో టాలీవుడ్ కోలీవుడ్ స‌హా దేశంలోని ఏ ఇత‌ర సినీప‌రిశ్ర‌మ నుంచి ఎవ‌రూ గుర్తింపును పొంద‌లేదు.

Tags:    

Similar News