మనమే ఆ సూపర్ హిట్ సినిమాలతో పోలిక..?

సినిమాలో హీరో హీరోయిన్ ఎప్పుడు గొడవ పడతారు అలా లీడ్ పెయిర్ గొడవ పడితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతాయని అన్నారు శర్వానంద్.

Update: 2024-06-02 12:23 GMT

ఆన్ స్క్రీన్ పై హీరో, హీరోయిన్ చీటికిమాటికి గొడవ పడితే ఆ సినిమా హిట్టే అంటున్నారు టాలీవుడ్ హీరో శర్వానంద్. ఆయన లీడ్ రోల్ లో శ్రీరాం ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా మనమే. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. జూన్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ ఎరేంజ్ చేశారు. సినిమాలో హీరో హీరోయిన్ ఎప్పుడు గొడవ పడతారు అలా లీడ్ పెయిర్ గొడవ పడితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతాయని అన్నారు శర్వానంద్. మనమే సినిమాలో నాతో కృతి శెట్టి గొడవ పడుతుంది. సినిమా అంతా అలానే ఉంటుందని అన్నారు.

ఐతే సినిమాలో హీరో హీరోయిన్ గొడవ పడిన సినిమాలు సక్సెస్ అయ్యాయి. అందుకు బెస్త్ ఎక్సాంపుల్ మురారి, ఖుషి సినిమాలని అన్నారు శర్వానంద్. మురారి సినిమాలో మహేష్ బాబు, సోనాలి బ్రిందే ఎప్పుడు గొడవ పడుతుంటారు. అఫ్కోర్స్ వాళ్లిద్దరు ప్రేమలో పడేవరకు ఇలానే ఉంటుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో కూడా ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉన్నా చివరి వరకు గొడవ పడతారు.

ఈ రెండు సినిమాలను ఉదాహరణగా తీసుకుని శర్వానంద్ మురారి, ఖుషి తరహాలోనే మనమే కూడా ఉంటుందని. ఆ సినిమాల్లానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు. శర్వానంద్ ఖాతాలో సూపర్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆ సక్సెస్ కోసం శర్వానంద్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇటు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కూడా కెరీర్ లో బ్యాడ్ ఫేజ్ ని ఎదుర్కుంటుంది. మనమే సినిమా హిట్ హీరో హీరోయిన్ ఇద్దరికీ కంపల్సరీ అని చెప్పొచ్చు.

మనమే ట్రైలర్ చూస్తే కూల్ అండ్ కలర్ ఫుల్ సినిమాగా అనిపిస్తుంది. అక్కడక్కడ ఎమోషన్స్ కూడా వర్క్ అవుట్ అయ్యేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ తరం యువకులు పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్స్ పీరియన్స్ అయ్యే ప్రతి విషయాన్ని ఈ సినిమాలో చూపించినట్టు ఉన్నారు. శర్వానంద్, కృతి శెట్టి అండ్ వాళ్లిద్దరికి ఒక బాబు ఈ ముగ్గురి మధ్యే కథ నడుస్తుంది. మరి మనమేతో ఈ కాంబో సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా లేదా అన్నది చూడాలి. శర్వానంద్ అండ్ టీం మాత్రం మనమే కచ్చితంగా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

Tags:    

Similar News