రజినీకాంత్ నడిచిన మట్టి ఫ్యాన్స్ కు అంత పవిత్రమా..
ప్రస్తుతం సినిమాలతో పాటూ సీరియల్స్ లో కూడా నటిస్తున్న అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మాట్లాడింది.
రజినీకాంత్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాల్లో అతిశయ పైరవి కూడా ఒకటి. చిరంజీవి హీరోగా తెరకెక్కిన యముడికి మొగుడు సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ముత్తు రామన్ దర్శకత్వం వహించగా, రజినీకాంత్ పక్కన హీరోయిన్ గా షీబా ఆకాశ్‌దీప్ నటించింది. ప్రస్తుతం సినిమాలతో పాటూ సీరియల్స్ లో కూడా నటిస్తున్న అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మాట్లాడింది.
అతిశయ పైరవి షూటింగ్ టైమ్ లో రజినీకి ఉన్న క్రేజ్ ను చూసి తాను షాకయ్యానంటుంది షీబా. రజనీకాంత్ ఎంతో గొప్ప వ్యక్తి అని, స్టార్ హీరో అయినప్పటికీ ఎక్కడా ఆ గర్వం లేకుండా అందరితోనూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడని ఆ రోజుల్లోనే ఆయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని, ఫ్యాన్స్ కు రజినీపై ఉన్న ఇష్టాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్టు తెలిపింది.
ఆయన్ను చూడ్డానికి కొన్ని వేల మంది ఫ్యాన్స్ వేకువఝామున నాలుగున్నర నుంచే లొకేషన్ కు వచ్చే వాళ్లని, ఆయన నడిచే దారిలో ఉన్న మట్టిని తీసుకుని దాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారని, కొంతమంది ఫ్యాన్స్ పూల దండలతో వచ్చి ఆయనపై ఉన్న భక్తి భావాన్ని చూపించేవాళ్లని రజినీ క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్స్ గురించి వెల్లడించింది షీబా.
అతిశయ పైరవి తన ఫస్ట్ మూవీ కావడంతో కెమెరా ముందు ఎలా ఉండాలి? ఎలాంటి ఎమోషన్స్ ను పలికించాలనే విషయంలో ఆయన తనకు చాలా సాయం చేశారని, కెమెరా ముందు భయపడుతున్న తనను గమనించి ఆ భయాన్ని పొగొట్టడానికి తనతో ఎక్కువ సేపు మాట్లాడేవారని, నటనకు సంబంధించిన పలు విషయాలు రజినీ తనకు నేర్పారని షీబా వెల్లడించింది.
అయితే ఆ సినిమా తర్వాత ఆమె రజినీని కలిసింది చాలా తక్కువని, కొన్నేళ్ల కిందట ఓ ఈవెంట్ లో ఆయన్ని చూశానని తెలిపింది. ఆయన వెంటనే తన దగ్గరకు వచ్చి పలకరించి మరీ యోగ క్షేమాలడిగాడని, అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన తనను గుర్తు పెట్టుకుని వచ్చి మాట్లాడటం ఆమెకు చాలా సంతోషాన్ని కలిగించిందని షీబా తెలిపింది.