రిస్కీ టైమ్ లోనే కమ్ముల 'కుబేర'
బిచ్చగాడి పాత్రలో ధనుష్, కోటీశ్వరుడిగా జిమ్ సర్బా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్ వీడియో ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.
శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా కుబేర విడుదల తేదీపై ఇప్పుడు ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా కాంబినేషన్ పైనే మంచి బజ్ ఉంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా వంటి భారీ తారాగణం ఉన్నారు.
బిచ్చగాడి పాత్రలో ధనుష్, కోటీశ్వరుడిగా జిమ్ సర్బా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్ వీడియో ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. నార్త్, సౌత్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించినట్లు గ్లింప్స్ చూస్తే స్పష్టమవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ భారీ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్లు సమాచారం.
త్వరలోనే ఈ డేట్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఫిబ్రవరి నెల అనేది సినిమాలకు అంత మంచి టైమ్ కాదని భావిస్తారు. ఎగ్జామ్స్ సమయం కావడంతో యూత్ ఎక్కువగా చదువుల్లో బిజీగా ఉంటారు. ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేసుకునే సినిమాలకు ఈ టైమ్ అంత అనుకూలంగా ఉండదు. కానీ, కుబేర నిర్మాతలు ఈ రిస్క్ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఓ వైపు ఓటీటీ కంపెనీల డిమాండ్ మేరకు కూడా రిలీజ్ డేట్స్ ను మార్చాల్సి వస్తోంది. అలాగే ఫిబ్రవరి నెల దాటితే ఆ తరువాత పెద్ద సినిమాలు కాచుకొని ఉన్నాయి. ఇక నిర్మాతల ప్లాన్ ప్రకారం, ఫిబ్రవరి టైమ్ లో ఈ సినిమాను విడుదల చేయాల్సి వస్తోందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అయితే, శేఖర్ కమ్ముల గత చిత్రాలను చూస్తే, ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి మంచి సపోర్ట్ ఉంటుంది.
యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కమ్ముల సినిమాలకు క్యూ కడతారు. హ్యాపీ డేస్, అనంద్, ఫిదా వంటి చిత్రాలు థియేటర్లకు విపరీతమైన ఫ్యామిలీ క్రౌడ్‌ను తెచ్చాయి. అందుకే, ఈసారి కూడా కుబేర రిస్కీ టైమ్‌లో విడుదల అయినా మంచి ఫలితం సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ మూవీని సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
శేఖర్ కమ్ముల తొలిసారి డిఫరెంట్ కాన్సెప్ట్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ప్రేక్షకులంతా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 21 రిస్కీ టైమ్ అయినా, కుబేర కంటెంట్ తో జనాల్ని థియేటర్ కు రప్పించే అవకాశం ఉందని మేకర్స్ నమ్ముతున్నారు. మొత్తానికి, ఫిబ్రవరిలో విడుదల అనేది కుబేర టీమ్ కు ఒక సాహసమే అయినప్పటికీ, కంటెంట్ బాగుంటే కచ్చితంగా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.