ఆ ఓపిక నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్..!

ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ ఇటు సౌత్ లో స్టార్డం తెచ్చుకుని బాలీవుడ్ వెళ్లి అక్కడ అదరగొట్టేస్తున్నారు.

Update: 2025-01-18 01:30 GMT

ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ ఇటు సౌత్ లో స్టార్డం తెచ్చుకుని బాలీవుడ్ వెళ్లి అక్కడ అదరగొట్టేస్తున్నారు. ఇక ఇదే ఛాన్స్ అన్నట్టుగా కొందరు బాలీవుడ్ భామలు కూడా సౌత్ సినిమా ఆఫర్లు అందుకుంటూ ఇక్కడ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా అంటే ఒకటే భాష.. ఒకటే వేదిక అనేలా ట్రెండ్ మారింది. ఐతే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ భామలు తెలుగు ఇంకా సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు కానీ ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి తెలుగు హీరోలతో ఎప్పుడో ఆడి పాడింది.

వెంకటేష్ తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో ఆజాద్, వీడెవడండీ బాబు సినిమాలు చేసింది. శిల్పా శెట్టి టాలెంట్ కి ఆమె స్టార్ గా ఎదిగినా కూడా ఇంకా ఎక్కడో అసంతృప్తి ఉంది. దాదాపు 30 ఏళ్ల సినీ జర్నీలో ఎన్నో సినిమాలు చేసిన శిల్పా శెట్టి బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లో కూడా అలరించింది. ఐతే స్టార్ ఫాం ఉన్నప్పుడే కాదు అవకాశాలు కాస్త సన్నగిల్లాక కూడా శిల్పా శెట్టి ఆడిషన్స్ ఇవ్వలేదట.

ప్రస్తుతం అన్ని భాషల్లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ షో ఒరిజినల్ షో బిగ్ బ్రదర్ కి ఇండియా నుంచి వెళ్లిన మొదటి కంటెస్టెంట్ శిల్పా శెట్టి. ఆ టైం లో ఆమె పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే బిగ్ బ్రదర్ షో చేశాక కూడా హాలీవుడ్ ఆఫర్లు అందిపుచ్చుకోలేదు శిల్పా శెట్టి. ఐతే అమ్మడు మాత్రం తాను ఎప్పుడు ఛాన్సుల కోసం అడగనని ఇప్పుడు అసలు అవసరమే లేదని అంటుంది.

ఆడిషన్ ఇచ్చి సినిమాలు చేసే ఓపిక అసలు లేదని. తన ప్రతిభ చాటేలా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించానని.. రాబోయే సినిమాల్లో కూడా అలానే చేస్తానని అంటుంది అమ్మడు. ప్రస్తుతం ఆడిషన్ ఇచ్చి సినిమాలో నటించే ఆసక్తి ఓపిక రెండూ లేవని ఛాన్స్ వస్తే చేస్తా లేదంటే లేదని అంటుంది శిల్పా శెట్టి. ఐతే సౌత్ ఆడియన్స్ కి పరిచయమే కాబట్టి తెలుగు పాన్ ఇండియా సినిమాల్లో శిల్పా శెట్టి నటిస్తే కచ్చితంగా అమ్మడికి మళ్లీ క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News