హైద‌రాబాద్‌లో శిల్పాశెట్టి లాభ‌సాటి వ్యాపారం

ఇటీవల అక్కినేని నాగ‌చైత‌న్య క్లౌడ్ కిచెన్ బిజినెస్ గ్రాండ్ స‌క్సెస్ అయింద‌ని చ‌ర్చించుకున్నాం.

Update: 2024-09-06 17:20 GMT

ఇటీవల అక్కినేని నాగ‌చైత‌న్య క్లౌడ్ కిచెన్ బిజినెస్ గ్రాండ్ స‌క్సెస్ అయింద‌ని చ‌ర్చించుకున్నాం. కింగ్ నాగార్జున వార‌సుడిగా రెస్టారెంట్ వ్యాపారంలోను చైతూ రాణిస్తున్నాడు. స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ప‌బ్ కం రెస్టారెంట్ బిజినెస్ లో స‌క్సెస‌య్యాడు. అలాగే ప‌లువురు స్టార్లు, ద‌ర్శ‌కుల‌కు సొంతంగా రెస్టారెంట్ బిజినెస్ లు ఉన్నాయి. అలాగే టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి రెస్టారెంట్ `వ‌న్ 8 కమ్యూన్`ని హైదరాబాద్ కి విస్త‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి వంతు. సాగ‌ర‌క‌న్య శిల్పా శెట్టి సహ యజమానిగా ఉన్న‌ బాస్టియన్ రెస్టారెంట్ అన్ని మెట్రో న‌గ‌రాల‌కు విస్త‌రిస్తోంది. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లోను బాస్టియ‌న్ రెస్టారెంట్ ప్రారంభం కానుంద‌ని తెలిసింది. భారతదేశంలో నాల్గవది ఇది. ముంబైలోని కోహినూర్ స్క్వేర్‌లోని 48వ అంతస్తులో ఉన్న బాస్టియన్ రెస్టారెంట్ ఉత్కంఠభరితమైన నగర వీక్షణలతో అల‌రారుతుంది. శిల్పా శెట్టి స్వయంగా రూపొందించిన ఆరోగ్య స్పృహ శుద్ధి చేసిన వంటల సమ్మేళనంతో అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.

బాస్టియన్ హైదరాబాద్ వచ్చిన వార్తను `హైదరాబాద్ ఫుడ్ డైరీస్` పేజీలో సుప‌రిచితుడు అయిన‌ హైదరాబాద్ ఫుడ్ బ్లాగర్ జుబైర్ అలీ ధృవీకరించారు. తన తాజా రీల్స్‌లో త్వ‌ర‌లో ప్రారంభం కానున్న శిల్పా శెట్టి రెస్టారెంట్ గురించి వెల్ల‌డించాడు. హైదరాబాద్ త్వరలో శిల్పా శెట్టి విలాసవంతమైన రెస్టారెంట్ బాస్టియన్‌ను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది! అని అత‌డు రాసాడు. బాస్టియన్ వినూత్న మెనూతో బాగా పాపుల‌రైంది. ఇది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే డైనర్‌లు, శుద్ధి చేసిన వంటకాలను ఇష్టపడేవారికి అందిస్తుంది. ముంబై అవుట్‌లెట్‌లో ప‌చ్చ‌ని అట‌వీ ప్రాంతాన్ని త‌ల‌పించే చోటు.. చక్కటి భోజన ప్రాంతంగా ఉంటుంది. మట్టి టోన్‌లతో ప‌ర్యావ‌ర‌ణ స‌హితంగా స్పెష‌ల్ గా ఫుడ్ ని అందిస్తారు. మెనూని శిల్పా శెట్టి స్వయంగా ప‌రిశీలించి ఓకే చేసారు. ఇది హైద‌రాబాదీ ఆహార‌ప్రియుల‌కు చ‌క్క‌నైన శుభవార్త‌.

Tags:    

Similar News