మోసం కేసులో శిల్పాశెట్టి-కుంద్రా ఎట్టకేలకు!
ఇటీవల రాజ్ కుంద్రా- శిల్పాశెట్టి దంపతులు బులియన్ వ్యాపారి పృథ్వీరాజ్ సరేమల్ కొఠారీ ని మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
సాగర కన్య గ్లామరస్ నటి శిల్పాశెట్టి పరిచయం అవసరం లేదు. శిల్పా శెట్టి వ్యక్తిగత, వృత్తిగత జీవితాల గురించి ఆమె భర్త, వ్యాపారవేత్త భర్త రాజ్ కుంద్రా వివాదాల గురించి ఇటీవల మీడియాలో కథనాలొచ్చాయి. ఇటీవల రాజ్ కుంద్రా- శిల్పాశెట్టి దంపతులు బులియన్ వ్యాపారి పృథ్వీరాజ్ సరేమల్ కొఠారీ ని మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అతడు కోర్టు మెట్లెక్కడంతో వివాదంపై చర్చ సాగింది. అయితే ఈ మోసం ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముంబై సెషన్స్ కోర్టు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత వారు వివాదంపై స్పందించిందివారు. మోసం కేసు నమోదైందని.. అయితే చెల్లించాల్సిన మొత్తం చెల్లించడం ద్వారా వారు వివాదానికి ముగింపు పలికారని శిల్పాశెట్టి- కుంద్రా తరపు న్యాయవాది నిర్ధారించారు.
రాజ్ కుంద్రా - శిల్పాశెట్టి కుంద్రాల లాయర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసారు. ఆ ప్రకటన సారాంశం ఇలా ఉంది. ''ఫిర్యాదుదారుడు 2022 సంవత్సరంలో నా క్లయింట్లు రాజ్ కుంద్రా - శిల్పాశెట్టిపై క్రిమినల్ కేసు వేసాడు. ఈ ఫిర్యాదును 2022 సంవత్సరంలో పోలీసులు న్యాయపరమైన ప్రక్రియను అనుసరించి క్షుణ్ణంగా విచారించారు. పోలీసుల దర్యాప్తు తర్వాత ఫిర్యాదుదారుడికి మొత్తం 90లక్షలు చట్టబద్ధమైన చెల్లించారు. నా క్లయింట్లు నమ్మకంగా ఈ పత్రాలను పోలీసు శాఖకు సమర్పించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఖాతాదారులకు న్యాయం చేశారు. ఈ విచారణ తర్వాత, ఫిర్యాదుదారుడు గౌరవనీయమైన కోర్టు ముందు సెక్షన్ 156(3) CrPC కింద ప్రైవేట్ ఫిర్యాదును దాఖలు చేయడానికి ఎంచుకున్నారు.
దాదాపు 2 సంవత్సరాల తర్వాత, గౌరవనీయమైన కోర్టు ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. దర్యాప్తు స్వతంత్రత న్యాయబద్ధతపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. సత్యం గెలుస్తుంది. నా క్లయింట్లు ఎటువంటి నేరం చేయలేదు. ఇది నా క్లయింట్‌ల వద్ద ఉన్న పత్రాల ద్వారా స్పష్ఠంగా ఉంది. ఫిర్యాదుదారు నా క్లయింట్‌ల మధ్య ఉన్న ఇన్‌వాయిస్, పేర్కొన్న ఒప్పందంలో మధ్యవర్తిత్వ నిబంధన ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అసలుపై వడ్డీ మొత్తం గురించి ఫిర్యాదుదారుకు ఏదైనా ఫిర్యాదు ఉంటే ఆర్బిట్రేషన్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ గౌరవనీయ సుప్రీంకోర్టు.. మన దేశంలోని వివిధ గౌరవనీయమైన హైకోర్టుల అనేక తీర్పుల ద్వారా వాణిజ్య వివాదాలను పరిష్కరించేందుకు క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించే చర్య తిరస్కరించబడింది. నా క్లయింట్లు ఈ పోరాటంలో చట్టబద్ధంగా పోరాడాలి. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారు. ప్రొసీడింగ్‌ల సరైన దశలో హానికరమైన ప్రొసీడింగ్‌ల కోసం ఫిర్యాదుదారుపై దావా వేసే హక్కును నా క్లయింట్లు కలిగి ఉన్నారు'' అని ప్రకటన ముగించారు.
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా కేసు వివరాల్లోకి వెళితే... గతంలో కొఠారీ దాఖలు చేసిన ఫిర్యాదులో, శెట్టి -కుంద్రా తమ సంస్థ సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2014లో పెట్టుబడి ప్లాన్ ని ప్రారంభించారని ఆరోపించారు. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా నిర్ధిష్ట తేదీలో నిర్ధారిత డెలివరీతో ముందస్తుగా తగ్గిన రేటు ప్రకారం బంగారం అందజేస్తామని హామీ ఇచ్చింది ఈ జంట. 24 క్యారెట్ల బంగారాన్ని 5,000 గ్రాములకు బదులుగా 2 ఏప్రిల్ 2019 నాటికి డెలివరీ చేయడానికి తాను రూ. 90 లక్షలు పెట్టుబడి పెట్టానని కూడా ఫిర్యాదుదారు నొక్కి చెప్పాడు. అయితే మెచ్యూరిటీ అయిన తర్వాత వాగ్దానం చేసినట్లుగా బంగారం లేదా దానికి సమానమైన విలువను పొందలేదని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. బదులుగా తనకు కేవలం 90 లక్షల రూపాయల ప్రిన్సిపల్ మొత్తాన్ని కవర్ చేసే పోస్ట్ డేటెడ్ చెక్కును అందించారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో అసలు మొత్తాన్ని చెల్లించడం ద్వారా చాలా వరకూ సమస్య పరిష్కారమైంది.