బిగ్ బాస్ 7 : శివాజి హౌస్ నుంచి ఎందుకు బయటకొచ్చాడు..?
శివాజి బయట ఎంతసేపు ఉన్నాడు అన్నది తెలియదు కానీ సోమవారం ఎపిసోడ్ లోనే అతను బయటకు వెళ్లడం మళ్లీ లోపలకు రావడం చూపించారు.
బిగ్ బాస్ సీజన్ 7 లో ఇంటి పెద్దగా మంచి చెడులను చూస్తూ తన ఆట ఆడుతున్నాడు శివాజి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లకు ఫుల్ సపోర్ట్ అందిస్తూ వారి ఆట మెరుగుపరచేందుకు సహకరిస్తున్నాడు శివాజి. అయితే సోమవారం ఎపిసోడ్ లో శివాజి బయటకు వచ్చినట్టు చూపించారు. రెండు వారాల క్రితం శివాజి టాస్క్ లో భాగంగా రైట్ హ్యాండ్ కాస్త బెనికి నట్టు అనిపించగా అతను అప్పటి నుంచి ఆ చేయి వాడట్లేదు. ఈ వీకెండ్ లో నయని ఎలిమినేషన్ టైం లో శివాజి నాగార్జునని తన హ్యాండ్ సహకరించట్లేదు తనని ఎలిమినేట్ చేయమని అడుగుతాడు.
అతని నొప్పిని అర్ధం చేసుకున్న నాగార్జున బిగ్ బాస్ నిర్వాహకులకు అతనికి స్కానింగ్ అవసరమని చెప్పి ఉండొచ్చు. అందుకే శివాజిని స్కానింగ్ కోసం బయటకు పంపించారు. ఆ తర్వాత వెంటనే అతన్ని మళ్లీ హౌస్ లోకి పంపించారు. శివాజి బయట ఎంతసేపు ఉన్నాడు అన్నది తెలియదు కానీ సోమవారం ఎపిసోడ్ లోనే అతను బయటకు వెళ్లడం మళ్లీ లోపలకు రావడం చూపించారు.
శివాజి వెళ్తున్నాడు అనగానే హౌస్ లో ముఖ్యంగా పాత కంటెస్టెంట్స్ అంతా కూడా షాక్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, యావర్ అయితే కాస్త ఎమోషనల్ అయ్యారు. మిగతా హౌస్ మెట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆయన స్కానింగ్ కి వెళ్లి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారు. అన్నట్టుగానే మళ్లీ హౌస్ లోకి వచ్చారు. అయితే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు శివాజి హౌస్ నుంచి బయటకు వెళ్లే ప్రోమోని అతనేదో ఎలిమినేట్ అయ్యాడు అన్నట్టుగా చూపించారు.
బిగ్ బాస్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు ఇలాంటి గిమ్మిక్కులు చాలా చేస్తుంది. ఇక మండే నామినేషన్స్ కార్యక్రమం షురూ అయ్యింది. సగానికి పైగా హౌస్ మెట్స్ నామినేషన్స్ వేశారు. అయితే పూర్తి నామినేషన్స్ ఈరోజు పూర్తవుతాయి. సో నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. ప్రిన్స్ యావర్ ఈ వారం కెప్టెన్ అయినందున అతన్ని ఎవరు నామినేట్ చేయలేదు. మిగతా వారిలో ఒక్క నామినేషన్ పడిన వారిని కూడా నామినేషన్స్ లో ఉంచాడు బిగ్ బాస్. అయితే ఎక్కువగా భోలే శావలి, ఆ తర్వాత అశ్వినికి నామినేషన్స్ పడినట్టు తెలుస్తుంది.