ఎన్టీఆర్ కోసం ఆ దర్శకుడు రెండేళ్లు ఆగుతాడా?
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో దేవర రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రానుంది. వచ్చే ఏడాది దేవర పార్ట్ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇది కాకుండా తారక్ హిందీలో డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ సెకండ్ షెడ్యూల్ లో త్వరలో జాయిన్ కాబోతున్నారు.
భారీ మల్టీ స్టారర్ స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా రెడీ అవుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేయబోతున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది. త్వరలో ఈ సినిమా క్యాస్టింగ్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందంట. డ్రాగన్ మూవీ కూడా రెండు భాగాలుగానే తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇలా జూనియర్ ఎన్టీఆర్ మరో రెండేళ్ల వరకు స్ట్రాంగ్ సినిమాల లైన్ అప్ ని పెట్టుకొని ఉన్నారు. ఈ సినిమాలు అన్ని గ్లోబల్ స్టార్ గా తారక్ ఇమేజ్ ని పెంచుతాయని భావిస్తున్నారు. అయితే గత కొంతకాలంలో ఇండస్ట్రీ ఓ ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది. హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శౌర్యువ్ తో తారక్ సినిమా చేయబోతున్నాడంట. ఇప్పటికే స్టోరీ విన్న తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
ఈ సినిమా స్టార్ట్ చేయాలంటే రెండేళ్లు వెయిట్ చేయాలని శౌర్యువ్ కి ఎన్టీఆర్ చెప్పారంట. ఆయన కూడా అందుకు సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో మూవీ స్టార్ట్ అయ్యేలోపు మరో సినిమాని శౌర్యువ్ చేసే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. శౌర్యువ్ తో సినిమా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందంట. రెండు భాగాలుగా యాక్షన్ ప్యాక్డ్ కథతో శౌర్యువ్ ఈ మూవీ స్క్రిప్ట్ ని సిద్ధం చేసారంట.
2026లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి 2028 ఆరంభంలో పార్ట్ 1 రిలీజ్ చేస్తారంట. మరో మూడేళ్ళ తర్వాత 2031లో పార్ట్ 2 రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారంట. మైరా ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించానుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాని అఫీషియల్ గా ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.