ఆ పాన్‌ ఇండియా మూవీలో శ్రద్దా దాస్‌ స్పెషల్‌...!

ఆ లోటును ఈ సినిమాతో భర్తీ చేయబోతున్నట్లుగా నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చాలా ధీమాగా చెప్పుకొచ్చారు.

Update: 2024-11-10 06:14 GMT

కోలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు పాన్‌ ఇండియా సినీ ప్రేమికులు, మీడియా వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ 'కంగువా'. గత నెల రోజులుగా సినిమా ప్రచారంను పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్‌ హీరోల, సూపర్‌ స్టార్‌ హీరోల సినిమాలు వచ్చాయి. కానీ అందులో ఏ ఒక్కటి వెయ్యి కోట్ల మార్క్‌ ను టచ్‌ చేయలేదు. తెలుగు, హిందీ, కన్నడ సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ను టచ్‌ చేస్తే తమిళ సినిమా ఇంకా ఆ మార్క్ కి దూరంగా ఉండటంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ లోటును ఈ సినిమాతో భర్తీ చేయబోతున్నట్లుగా నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చాలా ధీమాగా చెప్పుకొచ్చారు.

శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. జ్ఞానవేల్‌ రాజాతో పాటు తెలుగు నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులుగా ఉన్నారనే విషయం తెల్సిందే. తెలుగు లో భారీ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కంగువా సినిమాలో ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇటీవల రివీల్‌ అయింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన హీరోయిన్‌ శ్రద్దా దాస్‌ తో ఈ సినిమా కోసం ఒక పాట పాండించారట. దేవి శ్రీ ప్రసాద్‌ చాలా నమ్మకం పెట్టి ఆమెతో ఈ సినిమాలో పాట పాడించడం చర్చనీయాంశం అయింది. హీరోయిన్‌గా, ఐటం సాంగ్స్ హీరోయిన్‌గా మెప్పించిన శ్రద్దా దాస్ ఈసారి సింగర్‌గానూ మెప్పించింది.

కంగువా సినిమాలో శ్రద్దా దాస్ వాయిస్ తో స్పెషల్‌ అప్పియరెన్స్ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈమె పాడిన పాట యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యోలో అనే ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్‌, సాగర్‌ లు శ్రద్దా దాస్ తో కలిసి పాడటం జరిగింది. మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా స్పెషల్‌ సాంగ్‌ అంటూ ఉన్నారు. మొత్తానికి కంగువా వంటి భారీ పాన్‌ ఇండియా సినిమాలో శ్రద్దా దాస్ కి తన గాత్రం వినిపించే అవకాశం దక్కడం పెద్ద విషయమే. ఆఫర్లు రాకపోవడంతో సోషల్ మీడియాకు పరిమితం అయిన ఈ అమ్మడు ఇప్పుడు ఇలా ఒక ఛాన్స్ ను దక్కించుకోవడం పెద్ద విషయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సూర్య ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకోగా, కొన్ని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ భారీ పీరియాడిక్‌ డ్రామా ను ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఆశించినట్లుగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రావాలంటే మాత్రం మామూలు విషయం కాదు. భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మొదటి రోజు రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించాల్సి ఉంది. సూర్య కెరీర్‌ లో ఎన్నో సూపర్‌ హిట్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ అంటూ ప్రచారం జరుగుతున్న ఈ సినిమా నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Tags:    

Similar News