కమిటీ ఏర్పాటుకు ఓటేసిన శ్రద్ధా శ్రీనాధ్!
టాలీవుడ్ లో 2019 లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక విడుదల చేయాలన్న డిమాండ్ ఇప్పటికే ప్రభుత్వం ముందు పెట్టిన సంగతి తెలిసిందే.
జస్టిస్ హేమ కమిటీలు లాంటివి ఇతర సినీ పరిశ్రమల్లోనూ ఏర్పాటు చేయాలి? అన్న డిమాండ్ నటీమణుల నుంచి వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ ఇండస్ట్రీ తరహాలో లైంగిక వేధింపులు బయట పడాలంటే? కమిటీలతోనే సాధ్యమని మెజార్టీ వర్గం భావిస్తోంది. సమంత, ఖుష్బూ సహా చాలా మంది నటీమణులు కమిటీ ఏర్పాటుకు ముందుండి డిమాండ్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో 2019 లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక విడుదల చేయాలన్న డిమాండ్ ఇప్పటికే ప్రభుత్వం ముందు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే కోలీవుడ్ లో నూ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దానికి నటి రోహీణి అధ్యక్షురాలిగా ఎంపిక చేసారు. ఇప్పటికే ఫిర్యాదుల వెల్లువ కూడా మొదలైనట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రద్దా శ్రీనాధ్ కూడా ఇలాంటి కమిటీలు ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది.
నేను ఇండస్ట్రీలో సురక్షితంగానే ఉన్నా. ఇప్పటివరకూ ఎలాంటి వేధింపులకు గురవ్వలేదు. నేను కంపర్ట్ గా ఉన్నాను? ఆ రకంగా నేను అదృష్ట వంతురాలిని. కానీ ఇది అందరికీ వర్తిస్తుంది అంటే నమ్మను. ఓ మహిళగా నేను బాధిత మహిళల పట్ట నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పనిచేసే ప్రదేశంలో అభద్రతకు అవకాశం ఉంది. కొందరు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
లైగింక వేధింపులు అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థల అవసరం ఎంతైనా ఉంది. రోజు రకరకాల దాడులకు మహిళలు గురవుతున్నారు. అలాంటి వాటిని ప్రభుత్వాలు అరికట్టాల్సిన అవసరం ఉంది. ఏ ప్రదేశంలోనైనా మహిళ స్వేచ్ఛగా పనిచేసుకుని ఇంటికి రావాలి. కానీ జరుగుతోన్న ఘటనలు చూస్తుంటే భయమేస్తుంది` అని అంది.