ఆయన ఇంటికెదురుగా అద్దె ఇంట్లో కి హాట్ బ్యూటీ!

ఇటీవ‌లే `స్త్రీ-2` తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకుంది హాట్ బ్యూటీ శ్ర‌ద్దా క‌పూర్.

Update: 2024-08-29 11:30 GMT

ఇటీవ‌లే `స్త్రీ-2` తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకుంది హాట్ బ్యూటీ శ్ర‌ద్దా క‌పూర్. ఇప్ప‌టికే సినిమా 500 కోట్ల క్ల‌బ్ లో చేరింది. ఈ రేంజ్ లో వ‌సూళ్లు సాధిస్తుంద‌ని ట్రేడ్ స‌హా మేక‌ర్స్ కూడా అంచ‌నా వేయ‌లేదు. హిట్ అయితే 300 కోట్ల వ‌రకూ రావొచ్చ‌ని అంచ‌నా వేసారు. కానీ వాళ్ల అంచ‌నాల్ని మించి వ‌సూళ్లు సాధించింది. స్టిల్ ఇంకా థియేట‌ర్లో సినిమా ర‌న్నింగ్ లో ఉంది. మ‌రి 500 కోట్లు వ‌సూళ్లు చేసిన సినిమాకి శ్ర‌ద్దా క‌పూర్ ఎంత పారితోషికం తీసుకుని ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

తొలి పారితోషికంతో పాటు రిలీజ్ అనంత‌రం అద‌నంగా మ‌రికొంత లాభం కూడ నిర్మాత‌లు షేర్ చేసే అవ‌కాశం ఉంటుంది. అంత‌కు ముందు ఎన్నో హిట్ సినిమాలతో భారీగానే సంపాద‌న కూడ‌బెట్టింది. అయితే ఈ న‌టి ఇప్పుడు సొంత ఇంటి నుంచి అద్దె ఇంట్లోకి మారుతుంది. మ‌రి అన్ని కోట్లు ఉన్న భామ‌కి అద్దె ఇంట్లో ఉండాల్సిన ప‌నేంటి? అనుకుంటున్నారా? అయితే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

జుహూలోని శ్ర‌ద్దాకపూర్ తండ్రి శ‌క్తిక‌పూర్ 1987 లోనే ఓ ఇల్లు కొన్నారు. అందులో 35 ఏళ్ల‌గా ఉంటున్నారు. దీంతో అది పాత బ‌డింది. పాత క‌ట్ట‌డం కాబ‌ట్టి ఇంకా చెక్కు చెద‌ర‌కుంటా ఉంది. అయితే అదే ఇంటిని ఇప్పుడు రీమోడ‌లింగ్ చేయించాల‌ని శ్ర‌ద్దా క‌పూర్ భావించి తండ్రితో మాట్లాడి రెన్నోవేష‌న్ ప‌నులు మొద‌లు పెట్టింది. అందుకే అమ్ముడు ఇప్పుడు జుహూ ప్రాంతంలోని అద్దె ఇంటికి చేరింది.

ఈ అద్దె ఇల్లు కూడా బ‌య‌ట వాళ్ల‌ది కాదు. స్టార్ హీరో హృతిక్ రోష‌న్ ది. కొంత కాలం పాటు ఆ ఇంట్లో ఉండ‌టానికి హృతిక్ తో అమ్మ‌డు ఒప్పందం చేసుకుంది. స‌రిగ్గా ఆ ఇంటికి ఎదురుగానే బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఇల్లు కూడా ఉంటుంది. ఇవన్నీ జుహూ బీచ్ పాయింట్ ని ఆనుకుని ఉన్నాయి. ఆ విల్లా ఎంతో అందంగా ఉంటుంది.

Tags:    

Similar News