లెహంగాలో రాజహంసలా మెరిసిపోతున్న శ్రియ..!
ఆ లెహంగాకి మ్యాచింగ్ డైమండ్స్ ధరించింది. తన నడుము అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
టాలీవుడ్ ని ఒకప్పుడు ఏలిన హీరోయిన్లలో శ్రియా ఒకరు. యంగ్ హీరోలతో కెరీర్ ప్రారంభించి, స్టార్ హీరోల సరసన కూడా ఆడిపాడింది. శ్రియా కెరీర్ ని మొదలుపెట్టిన కొత్తలో కొంచెం బొద్దుగా, ముద్దుగా ఉండేది. కానీ, ఆ తర్వాత సన్నగా మారిపోయింది. ఇప్పుడు ఆమె వయసు 40ఏళ్లు అయినా, ఇప్పటికీ ఆమె మరింత అందంగా మెరిసిపోతోంది. ఎంతలా అంటే, ఇప్పటి హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా, వారికి మరింత పోటీ ఇచ్చేలా ఆమె అందం పెరిగిపోతోందనే చెప్పాలి.
ఇక, శ్రియ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన కూతురితో కలిసి ఆడుకుంటున్న ఫోటోలను సైతం తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా లెహంగాలో మెరిసిపోయింది. తెలుపు రంగు లెహలా లో నిజంగా దేవ కన్యలా కనపడుతోంది.
ఆ లెహంగాకి మ్యాచింగ్ డైమండ్స్ ధరించింది. తన నడుము అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆమెను అలా చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇప్పటికీ ఇంత అందం ఎలా సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో ఇంత హాట్ గా కనపడుతూ, జీర్ సైజ్ మెయింటైన్ చేయడం అంటే మాముల విషయం కాదు. అందులోనూ ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇలా ఉండటం చాలా కష్టం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, శ్రియ తనకు బిడ్డ పుట్టింది అని పరిచయం చేసే వరకు ఆమెకు అసలు పెళ్లైంది, పాప పుట్టింది అనే విషయం కూడా ఎవరికీ తెలీదు. లాక్ డౌన్ లోనే ఆమె తల్లి అయ్యింది. ఆ తర్వాత కూతురితో ఉన్న ఫోటోతో పాటు, తన భర్త ఫోటో కూడా షేర్ చేసి అందరికీ షాకిచ్చింది.
ఇక, సినిమాల విషయానికి వస్తే, ఆమె వరసగా ఆఫర్లు అందుకుంటూనే ఉంది. తెలుగు,త మిళం, హిందీ అనే తేడా లేకుండా, అన్ని భాషల్లోనూ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. అయితే, హీరోయిన్ రోల్ కాకపోయినా, నటకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ ఎంచుకొని దూసుకుపోతోంది.