పబ్లిక్‌లో ముద్దు వెనక శ్రీయ చెప్పిన సీక్రెట్స్
అయితే ఈ జంట పబ్లిక్ ఔటింగులు, అందరి ముందు బిడియం అన్నదే లేకుండా ముద్దులతో చెలరేగిపోవడం వగైరా మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
ప్రేమ పెళ్లి పేరుతో విదేశీ ప్రియుడిని కొంగున కట్టేసుకున్న గడుసరి పిల్లగా శ్రీయ శరణ్ ని అభిమానులు అభినందించకుండా ఉండలేరు. విదేశీ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడిన శ్రీయ అతడితో ప్రపంచ దేశాలను సందర్శించి ఇప్పుడు ముంబైలో కాపురం కూడా పెట్టింది. అయితే ఈ జంట పబ్లిక్ ఔటింగులు, అందరి ముందు బిడియం అన్నదే లేకుండా ముద్దులతో చెలరేగిపోవడం వగైరా మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
శ్రీయ తన భర్తతో పబ్లిక్ లో ముద్దు మురిపెం గురించి ఏనాడూ సరైన వివరణ ఇవ్వలేదు. దీనిపై ట్రోలర్లు విరుచుకుపడినా కానీ తగిన రీతిలో జవాబు ఇవ్వకపోవడం ఆశ్చర్యపరిచింది. ఎట్టకేలకు శ్రియా శరణ్ తన భర్త ఆండ్రీ కొస్చీవ్‌తో తన ముద్దు సంప్రదాయం గురించి ఓపెనైంది. మేము అలా ఎందుకు చేస్తామంటే.. ఇలా ఉంటేనే మకు సంతోషంగా ఉంటుందని మాత్రం తెలిపింది. శ్రియా శరణ్..తన భర్త ఆండ్రీ కొస్చీవ్ కలిసి హాజరయ్యే ప్రతి ఈవెంట్లో ముద్దుల సంప్రదాయంతో హృదయాలను దోచుకుంటున్నారు. ప్రేమికులరోజు (ఫిబ్రవరి 14)ను పురస్కరించుకుని శ్రియ ఇప్పుడు తన భర్తతో ఈ స్వీటెస్ట్ సంప్రదాయం గురించి ఓపెనైంది.
``ఏదైనా రిలేషన్ షిప్లో కఠినమైన సమయాలే కాదు.. మంచి సమయాలు ఉన్నాయి. నేను ముద్దు పెట్టుకున్న ఆ సమయంలో బాగా లేను.. బలహీనంగా ఉన్న విషయం నాకు ఇంకా గుర్తుంది. ప్రీమియర్ కోసం ఆండ్రీ థానే నుండి వచ్చాడు.. అతడు కూడా అలసిపోయాడు. అయినా నా కోసం వేచి ఉన్నాడు. నేను అతడి కోసం అక్కడే ఉన్నాను.. నేను చాలా ఉద్విగ్నంగా ఉన్నందున అతడు నన్ను ముద్దుపెట్టుకున్నాడు. అతడు నేను సుఖంగా ఉండేలా స్వీట్ గా ఉన్నాడు`` అని తెలిపింది. మొదట్లో ముద్దు వ్యవహారం ప్రయివేట్ గా అనిపించేది. తర్వాత నెమ్మదిగా అందరూ దానిని స్వీకరించడంతో సంతోషకరమైన దృశ్యంగా పరిణామం చెందింది. అందరూ తమాషాగా భావించి నవ్వడం మొదలుపెట్టారని శ్రియ తెలిపింది.
ఆశ్చర్యకరంగా ఫోటోగ్రాఫర్లు చాలా ముద్దుగా వారిని మళ్లీ ముద్దు పెట్టుకోమని అడిగారు. ఇతరులకు అసౌకర్యం కలిగించనంత వరకు బహిరంగంగా ముద్దును ప్రేమను వ్యక్తీకరించడం చాలా ముఖ్యం అని శ్రీయ పేర్కొంది. ``ఒక సాధారణ ముద్దు ఎవరి జీవితంలోనైనా కొద్దిగా సానుకూలతను తీసుకురాగలిగితే అది చాలా కూల్ గా ఉంటుంది. అది ప్రతి సంఘటనలో ఒక కీలక అంశంగా మారింది`` అని పేర్కొంది.
వాలెంటైన్స్ వీక్ సంప్రదాయ వేడుకలపై తనకు నమ్మకం లేదని కూడా తాజా చిట్ చాట్ లో శ్రియ పేర్కొంది. దయాగుణం ఆప్యాయత అందమైన హావభావాలను కలిగి ఉండడం ప్రేమికులకు అవసరమని పేర్కొంది. ఒకరినొకరు బాగా చూసుకోవడమే ప్రేమ అని పేర్కొంది. ముద్దులతో బహిరంగంగా ఆప్యాయత ప్రదర్శించడం ప్రేమ, ఆనందం తాలూకా సహజ వ్యక్తీకరణలు (ఎక్స్ ప్రెషన్స్) అని డిఫైన్ చేసింది.
పబ్లిక్ ప్లేస్ లేదా ఇతర వ్యక్తులు కెమెరా ముందు ఇలా చేయడం సౌకర్యంగా ఉండకపోవచ్చు. నేను ప్రతిదీ ఓపెన్ గా ఉంచడానికి ఇష్టపడే బహిర్ముఖిని అని అభివర్ణించడం చాలా సుఖం.. మేము ఇలా చేయడం మాకు సంతోషాన్ని ఇస్తుంది.. దాని వెనుక వేరొక కారణం ఏదీ లేదు అని శ్రీయ శరణ్ వ్యాఖ్యానించారు. ఒక ముద్దు మీ బ్యాడ్ డే బలహీనమైన మానసిక స్థితి లేదా గొడవను కూడా నయం చేస్తుంది! అని శ్రీయ అభిప్రాయపడింది.