దేవరలో అమ్మడు ఇచ్చే షాక్ కి మైండ్ బ్లాక్ అవుతుందా..?

అంతేకాదు బాలీవుడ్ సినిమాలతో పాటు మరాఠి సినిమాలతో కూడా ఆమె క్రేజ్ తెచ్చుకున్నారు.

Update: 2024-09-25 04:42 GMT

ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వి కపూర్ సౌత్ సినిమా ఎంట్రీగా దేవర భారీ అంచనాలతో వస్తుంది. శ్రీదేవి తరహాలో సౌత్ సినిమాల్లో కూడా రాణించాలని చూస్తుంది జాన్వి కపూర్. ఐతే దేవర సినిమాలో కేవలం జాన్వి మాత్రమే కాదు మరాఠి హీరోయిన్ శృతి మరాఠి కూడా నటించింది. శృతి మరాఠి హిందీ సీరియల్స్ తో చాలా పాపులర్. అంతేకాదు బాలీవుడ్ సినిమాలతో పాటు మరాఠి సినిమాలతో కూడా ఆమె క్రేజ్ తెచ్చుకున్నారు.

సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో నటిస్తుండగా ఒక పాత్రకు జాన్వి మరో పాత్రకు శృతి జత కడుతున్నారు. దేవర భార్యగా శృతి నటిస్తుందని టాక్. ఐతే ఆ పాత్రకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని అమ్మాయిని తీసుకోవాలనే ఉద్దేశంతో శృతిని తీసుకున్నారట కొరటాల శివ. అంతేకాదు సినిమాలో ఆమె పాత్ర నిడివి ఉన్నంతసేపు అదరగొట్టేసిందని అంటున్నారు.

దేవర పార్ట్ 1 లో జాన్వి కపూర్ ఎక్కువగా గ్లామర్ కే పరిమితమైనట్టు అనిపిస్తుంది. జాన్వి పాత్ర కూడా స్ట్రాంగ్ గా ఉండేలా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడట. ఐతే జాన్వి నిడివితో పోల్చితే శృతి మరాఠి లెంగ్త్ తక్కువ అయినా అమ్మడు తన పెర్ఫార్మెన్స్ తో షాక్ ఇస్తుందని అంటున్నారు. సినిమా లో అన్ని పాత్రలకు పర్ఫెక్ట్ కాస్టింగ్ జరిగిందని డైరెక్టర్ కొరటాల శివ చెప్పుకొచ్చారు.

దేవర లో తను నటించడం చాలా సంతోషంగా ఉందని శృతి మరాఠి సోషల్ మీడియా ఫ్యాన్స్ తో చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆమధ్య అమ్మడు తన సోషల్ మీడియాలో దేవరకు సంబంధించిన రెండు స్టిల్స్ అంటే ఒకటి యంగ్ లుక్ తో.. మరోటి ఓల్డ్ లుక్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. దేవర సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందని చెప్పింది శృతి మరాఠి. ఇన్నాళ్లు బాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం ఉన్న శృతి ఈ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తుంది. తారక్ సినిమాతో పరిచయం అవుతుంది కాబట్టి అమ్మడి టాలెంట్ నచ్చితే మాత్రం వరుస ఛాన్సులు ఇచ్చేస్తారని చెప్పొచ్చు. పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమాకు ఉన్న క్రేజ్ ని అర్ధం చేసుకున్న శృతి ఇక్కడ అవకాశాలు వస్తే చేస్తానని చెబుతుంది.

Tags:    

Similar News