దేవర.. ఈమె జాన్వీ కంటే అందంగా..
‘దేవర’ చిత్రంలో తండ్రిగా నటించిన జూనియర్ ఎన్టీఆర్‌కు శృతి మరాఠే భార్యగా నటించింది.
సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరోల తర్వాత హీరోయిన్లే బాగా అందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ, కొన్ని కొన్ని సినిమాల్లో మాత్రం ఫీమేల్ లీడ్స్ కంటే అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు బాగా హైలైట్ అవుతుంటారు. మరికొన్ని చిత్రాల్లో మాత్రం హీరోయిన్లతో సమానంగా ప్రత్యేక ఆకర్షణ అవుతుంటారు. ఇప్పుడు అలా అయిన వారిలో ‘దేవర’ సినిమాలో నటించిన శృతి మరాఠే (Shruti Marathe) ఒకరు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రమే ‘దేవర’. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన స్పందనను అందుకుని సత్తా చాటుకుంది. ఫలితంగా కోట్ల వసూళ్లను సాధించి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఎన్టీఆర్ డుయల్ రోల్‌లో నటించగా.. అతడికి జంటగా జాన్వీ కపూర్‌తో పాటు శృతి మరాఠే అని కూడా నటించింది.
‘దేవర’ చిత్రంలో తండ్రిగా నటించిన జూనియర్ ఎన్టీఆర్‌కు శృతి మరాఠే భార్యగా నటించింది. ఇందులో ఆమె ఎంతో డీసెంట్‌గా కనిపించినప్పటికీ.. నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులను ఫిదా చేసేసింది. ఒకవైపు జాన్వీ కపూర్ తనదైన అందాల ఆరబోతతో హైలైట్ అవగా.. శృతి మరాఠే మాత్రం అచ్చ తెలుగు భామలా పద్దతైన చీరకట్టులోనే కనికట్టు చేసింది. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో అద్భుతమైన నటన, హావభావాలతో మాయ చేసింది. దీంతో అసలు ఈ అమ్మడు ఎవరు అని చాలా మంది ఇంటర్నెట్ వేదికగా వెతుకులాట ప్రారంభించారు.
శృతి మరాఠే గుజరాత్‌కు చెందిన నటి. ఆమె ‘సనాయి చౌగదే’ అనే మరాఠి సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత హిందీ, కన్నడం, గుజరాతీ, తమిళ భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్నేకర్‌కు వివాహం చేసుకుంది. అలాగే, చాలా సీరియళ్లలో సైతం నటించి ఫేమస్ అయింది. ఇప్పుడు ఈ చిన్నదే ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్‌లోనూ తనదైన మార్కును చూపించింది.
38 ఏళ్ల శృతి మరాఠే వరసగా సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తనదైన అందచందాలతో నెటిజన్లను మాయ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా అప్పుడప్పుడూ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలో రెచ్చిపోయి రచ్చ చేస్తోంది. దీనికితోడు ‘దేవర’ వంటి పాన్ ఇండియా చిత్రం ద్వారా ఇప్పుడు శృతి మరాఠే దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది.