సంఘంలో నియ‌మ‌నిబంధ‌న‌లు నాకు వ‌ర్తించ‌వు: శృతిహాస‌న్

తాము ఏం అనుకుంటే అది చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతుంటారు. తాను కూడా అదే త‌ర‌హా అని చెబుతోంది అందాల శృతిహాస‌న్

Update: 2023-07-21 16:24 GMT

ఎవ‌రు ఏం చేసినా సంఘం క‌ట్టుబాట్ల‌కు లోబ‌డి ఉండాలి. అలా కాకుండా సంఘానికి వ్య‌తిరేకంగానో దూరంగానో ఏదో ఒక‌టి చేసేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే దానికి సంఘం అడ్డు చెబుతుంది. అయితే ఇన్ని తెలిసినా రూల్స్ ని బ్రేక్ చేసి తాము వెళ్లాల‌నుకున్న దారిలో వెళుతుంటారు కొంద‌రు. ఇలాంటి వాళ్లు విమ‌ర్శ‌ల్ని సైతం లెక్క చేయ‌రు. తాము ఏం అనుకుంటే అది చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతుంటారు. తాను కూడా అదే త‌ర‌హా అని చెబుతోంది అందాల శృతిహాస‌న్. త‌న‌కు సంఘంలో నియ‌మ‌నిబంధ‌న‌లు చెల్ల‌వ‌ని ప‌రోక్షంగా వెల్ల‌డించింది. అయినా మ‌న‌వాళ్లు చెప్పే నియ‌మనిబంధ‌న‌లతో స‌ర్ధుకుపోవ‌డం అంత సులువు కాద‌ని కూడా శృతి అంది.

నిజానికి శృతి హాసన్ ఈ సంఘం విష‌యంలో తిరుగుబాటు వైఖరిని కలిగి ఉంది. సమాజంలోని అన్ని నియమ‌ నిబంధనలతో సరిపోలడం తనకు ఇబ్బందిగా ఉందని.. అనేక సవాళ్లతో సర్దుబాటు చేసుకోవడం కష్టతరంగా ఉంద‌ని చెప్పింది. కానీ త‌న‌ను `విచిత్రమైన అమ్మాయి` అని కామెంట్ చేసేవాళ్ల‌కు క‌వితాత్మ‌కంగా శృతి ఇచ్చిన జ‌వాబు ఆస‌క్తిని క‌లిగించింది. త‌న‌కు మాత్ర‌మే చెల్లిన విద్య గురించి త‌ల‌చి శృతి ఒక ప్రాసను కూడా షేర్ చేసింది. అంతేకాదు ఏది త‌ప్పు ఏది ఒప్పు అనేవి త‌న‌కు తెలుసున‌ని త‌ప్పొప్పుల‌ను విశ్లేషించ‌గ‌ల‌న‌ని కూడా అంది.

ఇన్ స్టాలో కవితాత్మకమైన రైమ్:

"నిద్రలేమి ఆలోచనలు..

"మధ్యలో ఎక్కడో,.. నేను సరిపోవడం లేదా?

"అయితే నేను కూడా అలా చేస్తానా?"

"ఇది నాకు ఎప్పుడూ రహస్యం"

"విభిన్నంగా ఉండటం ఆనందంగా ఉంది"

"తప్పుగా అర్థం చేసుకోవడం.. ఆ ప్రయాణంలో భాగం"

"నేను ఆ చోటుని సమయాన్ని చేరుకున్నానని అనుకుంటున్నాను

"ఎక్కడ శ్రద్ధ వహించాలో నాకు తెలుసు"

"ఇప్పటికి

"అండ్ ఇప్పుడు ప్రారంభించండి"

"ఉఫ్.. ఆ వ్యక్తులు వస్తువులు..

"నేను గర్వించదగిన విచిత్రుడిని"

" నేను మీకు నా ప్ర‌తిభ‌ను చూపించడానికి వేచి ఉండలేను"

"నా మాయా విచిత్రమైన భూమి"

.. అంటూ క‌వితాత్మ‌కంగా స్పందించింది.

శృతి సినిమాల్లో న‌టిస్తున్నా సంగీతంలో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ప్రత్యామ్నాయ రాక్ బ్యాండ్ ది ఎక్స్ ట్రామెంటల్స్ లోను సభ్యురాలిగా గాయ‌కురాలిగా కూడా పాపుల‌రైంది. శృతి తన దైనందిన జీవితంలో కొత్త వేషధారణ.. సంగీతం .. ఫ్యాషన్ సెన్స్ ను ప్రదర్శించే క్లిప్ లను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంది. దానివల్ల శృతికి భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారు. శృతి 2009లో `లక్` సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె `దిల్ తో బచ్చా హై జీ`..`రామయ్యా వస్తావయ్యా` ..`గబ్బర్ ఈజ్ బ్యాక్` వంటి హిందీ చిత్రాలలో కనిపించింది. టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ -ఎవడు -క్రాక్ -వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్ట‌ర్ల‌లో న‌టించింది. ప్రభాస్ స‌లార్ లో కూడా కనిపిస్తుంది. ల‌క్ -ఆజ్మా- డిడే -అల్విదా వంటి హిందీ చిత్రాలకు శృతి పాటలు పాడింది. గాయ‌నిగా అవార్డులు రివార్డులు అందుకుంది.

Tags:    

Similar News