హై వోల్టేజ్ కాంబినేషన్ కోసం శృతి పాప!

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా శృతి హాసన్ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది

Update: 2024-04-16 04:13 GMT
హై వోల్టేజ్ కాంబినేషన్ కోసం శృతి పాప!
  • whatsapp icon

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా శృతి హాసన్ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ ఆరంభంలో సింగర్ గా ప్రయత్నాలు చేసి.. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా మారాలని అనుకుంది. కానీ అవేవీ వర్క్ అవుట్ కాలేదు. దీంతో హీరోయిన్ గా యూ టర్న్ తీసికుంది. శృతి హాసన్ కి నటిగా ఆరంభంలో వరుస ఫెయిల్యూర్స్ వచ్చాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఆ మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్, అల్లు అర్జున్ రామ్ చరణ్, సూర్య, ధనుష్ లాంటి స్టార్స్ తో నటించింది. చివరిగా ఈ అమ్మడు వాల్తేర్ వీరయ్యలో చిరంజీవికి జోడీగా చేసింది. వీరసింహారెడ్డితో బాలయ్యతో జత కట్టింది. సలార్ మూవీలో ప్రభాస్ కి జోడీగా కనిపించింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో సలార్ 2, చెన్నై స్టోరీ అనే ఆంగ్లో ఇండియన్ మూవీ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మరో బిగ్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుందని టాక్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం లోకేష్ కనగరాజ్ శృతి హాసన్ ని ఎంపిక చేసాడంట.

లోకేష్, శృతి హాసన్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. రీసెంట్ గా ఇద్దరు కలిసి ఓ ఆల్బమ్ సాంగ్ లో నటించారు. శృతి హాసన్ ఈ సాంగ్ ని పాడింది. ఈ ఫ్రెండ్ షిప్ తోనే రజినీకాంత్ సినిమాలో శృతి హాసన్ కి లోకేష్ కనగరాజ్ ఓ రోల్ ఆఫర్ చేసాడంట. ఆమె కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రావొచ్చని కోలీవుడ్ లో ప్రచారం నడుస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ 171వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో రజినీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. లోకేష్ స్టైల్ లో సాగే గ్యాంగ్ స్టార్ కథతోనే ఈ మూవీ ఉండబోతోందని టాక్. చివరిగా లోకేష్ లియో మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయిన కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం పవర్ ఫుల్ కథని సిద్ధం చేసాడని తెలుస్తోంది.

Tags:    

Similar News