'యానిమ‌ల్‌'కి ట్రిప్తి.. 'దేవ‌ర‌'కు ఈ బ్యూటీ..!

యానిమ‌ల్ చిత్రంతో రష్మిక మంద‌న‌తో పాటు ట్రిప్తి దిమ్రికి మంచి పేరొచ్చింది. అంత‌కుముందు ట్రిప్తి అంటే ఎవ‌రో తెలిసింది త‌క్కువ మందికే

Update: 2024-02-10 06:30 GMT

యానిమ‌ల్ చిత్రంతో రష్మిక మంద‌న‌తో పాటు ట్రిప్తి దిమ్రికి మంచి పేరొచ్చింది. అంత‌కుముందు ట్రిప్తి అంటే ఎవ‌రో తెలిసింది త‌క్కువ మందికే. కానీ ఈ బ్యూటీ అనూహ్యంగా నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారిపోయింది. అయితే ట్రిప్తికి ఈ అవ‌కాశం క‌ల్పించింది సందీప్ రెడ్డి వంగా. అందుకు అత‌డికి ఆమె చాలా విధాలుగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది.

ఇప్పుడు ట్రిప్తి త‌ర‌హాలోనే టాలీవుడ్ లో బిగ్ బ్రేక్ అందుకోబోతున్న మరో అదృష్ట‌వంతురాలి గురించి చ‌ర్చ సాగుతోంది. ప్రముఖ మరాఠీ నటి శ్రుతి మరాఠే దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించనున్నారని తెలిసింది. కొర‌టాల ఈ భామ‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు స‌మాచారం. శ్రుతి పాత్ర గురించిన వివరాలేవీ బ‌య‌ట‌కు రాక‌పోయినా కానీ, ఈ పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే ఇది యానిమ‌ల్ లో గ్లామ‌ర‌స్ పాత్ర‌తో మురిపించిన ట్రిప్తి దిమ్రీలా అద‌న‌పు గ్లామ‌ర్ తో ఓల‌లాడిస్తుంద‌ని మాత్రం అంచ‌నా వేస్తున్నారు.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న క‌థ‌నాల‌ ప్రకారం .. దేవ‌ర‌ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసే అవకాశం ఉందని క‌థ‌నాలొస్తున్నాయి. ప్రొడక్షన్ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ అవతార్‌లలో కనిపించాలనే ఆలోచన అభిమానులను ఎగ్జ‌యిట్ చేస్తోంది. ఇందులో ఆ రెండో పాత్ర కోసం మ‌రాఠా బ్యూటీ శ్రుతిని ఎంపిక చేసుకుంటున్నార‌నేది ఒక గుస‌గుస‌. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్రధాన ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్, కళైయరసన్, మురళీ శర్మ వంటి సీనియర్ తార‌లు న‌టిస్తున్నారు.

దేవ‌ర‌ను రెండు భాగాలుగా తెర‌కెక్కించి విడుదల చేయనున్నారు. దేవర: పార్ట్ 1 ఏప్రిల్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వ‌స్తోంది. అయితే ఇటీవలి పరిణామాలు మేకర్స్ 2024 ద్వితీయార్ధంలో విడుదల తేదీని సవరించినట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దేవరతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2లో తన పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. హృతిక్ రోషన్- కియారా అద్వానీ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రతినాయకుడిగా చూపించ‌నున్నార‌ని తెలిసింది.

Tags:    

Similar News