న‌టి ఇంట్లో 10 తులాల బంగారం డ‌బ్బు దోపిడీ

దొంగతనం జూన్ 3 సోమవారం నాడు జరిగింది. నటి తన తల్లితో కలిసి నివసిస్తుంది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.

Update: 2024-06-09 07:49 GMT

ప్ర‌ముఖ న‌టి ఇల్లు దోపిడీకి గురైంది. దొంగ‌లు డ‌బ్బు బంగారం దోచుకెళ్లారు. ఘ‌ట‌న పూర్వాప‌రాల్లోకి వెళితే.. ప్ర‌ముఖ నటి కం నిర్మాత శ్వేతా షిండే ఇంట్లో ఇటీవల దొంగలు చోరీకి పాల్ప‌డ్డారు.ఈ ఘటన ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహారాష్ట్ర సతారా ప్రాంతంలో ఈ న‌టి నివ‌శిస్తున్నారు. మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. దొంగతనం జూన్ 3 సోమవారం నాడు జరిగింది. నటి తన తల్లితో కలిసి నివసిస్తుంది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.

ఈ దొంగతనం కేసుకు సంబంధించి శ్వేతా షిండే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నటి శ్వేతా ఉద్యోగం నిమిత్తం ముంబైలో ఉన్నప్పుడు ఈ దొంగతనం జరిగినట్లు సమాచారం. జూన్ 3న జ‌రిగిన‌ చోరీ లో సుమారు 110 గ్రాముల నగలు, కొంత నగదు దోచుకెళ్లినట్లు సమాచారం. ఫిర్యాదు అనంత‌రం శ్వేతా మీడియా ఇంటరాక్షన్‌లో సంఘటన గురించి వెల్ల‌డించారు. ఆమె మాట్లాడుతూ, ''సతార్‌లోని నా ఇంట్లో జూన్ 3.. సోమవారం రాత్రి చోరీ జరిగింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చాను. 10 తులాల బంగారం, డబ్బు అపహరణకు గురయ్యాయి'' అని తెలిపారు. అయితే ఎంత నగదు చోరీకి గురైందో తెలియలేదు. త్వరలోనే నేరస్థులు పట్టుబడతారని ఆమె సానుకూలంగా ఉన్నారు.

శ్వేతా షిండే లగీరా జలా జీ , డాక్టర్ డాన్ సీరియల్ ల‌ నిర్మాతగా పాపుల‌ర‌య్యారు. 1998 CID, కుంకుమ్, ఏక్ ప్యారా సా బంధన్, తుమ్హారీ దిశ, వదల్వాత్, మహారాష్ట్రచా నాచ్ బలియే, లక్ష్య, ఉంచ్ మఝా జోకా, నవే లక్ష్య వంటి హిట్ సీరియల్‌లలో నటించారు. బ్లాక్ బస్టర్ చిత్రం, గదర్: ఏక్ ప్రేమ్ కథలో సకీనా స్నేహితురాలిగా నటించింది. ఇది కాకుండా బాప్ రే బాప్ డోక్యాల తాప్, జవాయి బాపు జిందాబాద్, యెల్కోట్ యెల్కోట్ జై మల్హర్, లడీ గోడి, ధాటింగ్ దింగానా, డియోల్ బ్యాండ్, తోహ్ ఆనీ మీ వంటి చిత్రాల్లోను త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.

2007లో సందీప్ భన్సాలీని పెళ్లి చేసుకున్న శ్వేతా షిండేకు ఒక కూతురు కూడా ఉంది. 2016లో తోటి చిత్ర దర్శకుడు సంజయ్ ఖంబేతో కలిసి వజ్ర ప్రొడక్షన్ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది.

శ్వేతా షిండే ప్రస్తుతం నటనకు బదులు నిర్మాత‌గా ప‌లు ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టింది. ఆమె దేవ్‌మనుస్ చిత్రాన్ని నిర్మించింది. రాజు సావంత్ - అమిత్ సావర్డేకర్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ డ్రామా చిత్ర‌మిది. జీ మరాఠీలో ప్రసారం అయింది. ఇటీవల విడుదలైన సీరియల్ అప్పి ఆమ్చి కలెక్టర్ కు నిర్మాత‌గా ఉన్నారు. ఇందులో శివాని నాయక్, సంతోష్ పాటిల్, పరశురామ్ రోహిత్, సునీల్ డోంగర్, నీలం వాడేకర్ త‌దిత‌రులు నటించారు.

Tags:    

Similar News