చివరికి ఇలాంటి పరిస్థితుల్లో.. సిద్ధార్థ్ కంటతడి!

చిన్న సినిమాను ఈ అక్టోబర్ 6 విడుదల చేయబోతున్నారు. అయితే ప్రమోషన్ లో భాగంగా సిద్ధార్థ్ తనకు జరిగిన చేదు అనుభవాల గురించి చెప్పకున్నాడు.

Update: 2023-10-03 16:42 GMT

ఒకప్పుడు బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ను సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. అతని డేట్స్ కోసం అప్పట్లో నిర్మాతలు క్యూ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తామన్న నిర్మాతలు కూడా ఉన్నారు.

ఇక ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేసుకున్నవారు కూడా ఉన్నారు. కానీ కొంతకాలానికి సిద్ధార్థ్ వరుస పరాజయాలు మార్కెట్ కోల్పోయేలా చేశాయి. కేవలం అతను ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి పరిమితమయ్యాడు. అక్కడే సినిమాలు చేసుకుంటూ వెళ్తూ అప్పుడప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నచ్చిన సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

చివరగా మహాసముద్రం సినిమాలో నటించగా అది డిజాస్టర్ అయింది. అయితే రీసెంట్గా అతని నుంచి వచ్చిన చిన్న అనే సినిమా తమిళంలో నుంచి గుర్తింపును అందుకుంది. ఇక ఆ సినిమాను మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలి అనే సిద్ధార్థ్ గత రెండు మూడు వారాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ తరుణంలో అతనికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి.

ముఖ్యంగా తెలుగులో అయితే సిద్ధార్థ సినిమా ఎవరు చూస్తారు అనే కారణంతో అతని సినిమా కూడా దీంతో ఈ విషయాన్ని చెప్పుకుంటూ సిద్ధార్థ ఎమోషనల్ అయ్యాడు. చిన్న సినిమాను ఈ అక్టోబర్ 6 విడుదల చేయబోతున్నారు. అయితే ప్రమోషన్ లో భాగంగా సిద్ధార్థ్ తనకు జరిగిన చేదు అనుభవాల గురించి చెప్పకున్నాడు.

ఈ సినిమాను తమిళంలో కన్నడలో అలాగే మలయాళం లో మంచి పేరున్న నిర్మాతలు తీసుకున్నారు అని, కానీ తెలుగులో మాత్రం ఎవరు కొనడానికి సిద్ధపడలేదు అని ఇప్పుడు సిద్దార్థ్ సినిమా ఎవరు చూస్తారు అనే కామెంట్స్ కూడా తనను బాధించాయని చెప్పుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు. అప్పుడు సిద్ధార్థ్ డేట్స్ కోసం ఎగబడిన వారు కూడా ఇప్పుడు కనీసం అతని సినిమాపై చిన్న సహాయం కూడా చేయడం లేదు.

ఇక ఈ టైంలో అతనికి అండగా ఏషియన్స్ సునీల్ వచ్చినట్లు తెలియజేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన రావాల్సిన సినిమా అని కాకపోతే థియేటర్లు దొరకలేదు అని ఇప్పుడు ఈ చిన్న సినిమాకు ప్రేక్షకులు సపోర్ట్ చేసే సినిమాను నిలబెట్టాలి అని అన్నారు. ఇక ఇంతకంటే మంచి సినిమాను నా జీవితంలో ఇవ్వలేను అని సిద్దార్థ్ ఎంతో ఎమోషనల్ గా తెలియజేశాడు.

Tags:    

Similar News